కృష్ణ

సాంకేతిక విద్యలో పాలిటెక్నిక్‌కు అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, డిసెంబర్ 20: సాంకేతిక విద్యా శాఖలో పాలిటెక్నిక్‌కు అధిక ప్రాధాన్యత ఉందని సాంకేతిక విద్య, ఉన్నత విద్య ప్రత్యేక కమిషనర్ జిఎస్ పాండాదాస్ అన్నారు. స్థానిక ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మంగళవారం 21వ రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 13 జిల్లాల నుండి 120 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన 1100 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేయటంతో గుడ్లవల్లేరులో పండుగ వాతావరణం నెలకొంది. ప్రాంతీయ సాంకేతిక విద్యా సంచాలకుడు పికె సూర్యప్రకాష్, సంస్థల చైర్మన్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు స్వాగత నృత్యాలతో అలరించారు. ఆట పాటలు మన జీవన విధానంలో ఒక అలవాటుగా మార్చుకోగలిగితే ఆరోగ్యంతో పాటు ఆశావాదంతో ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చునని పాండాదాస్ అన్నారు. సాంకేతిక విద్యా శాఖలో పాలిటెక్నిక్‌కు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉందన్నారు. ఈ సందర్భంగా సోలార్, విండ్ ఎనర్జీ వంటి నూతన అంశాలతో సిలబస్‌ను మార్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అధ్యాపకులు నుండి విశేష స్పందన, సహాయం లభిస్తున్నాయన్నారు. అనంతరం పావురాలను, త్రివర్ణ బెలూన్స్‌ను ఎగురవేశారు. క్రీడాకారులు క్రీడాజ్యోతిని తీసుకురాగా ముఖ్య అతిథి క్రీడా జ్యోతిని ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్లు ఎ మురళీ, సుజాత, సంస్థ ప్రెసిడెంటు వి సుబ్బారావు, ప్రిన్సిపాల్ పి నాగేశ్వరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ పి రవీంద్రబాబు, ఫార్మసీ ప్రిన్సిపాల్ ఎ లక్ష్మణరావు, హైస్కూల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసమూర్తి, పీడి శివశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చెక్ పోస్టుల్లో అవకతవకలు సహించేది లేదు
* మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 20: ఏ చెక్‌పోస్టులోనైనా అవకతవకలు జరిగినట్లు తెలిస్తే ఎవరిని వదిలేది లేదని, తక్షణమే విధుల నుండి తొలగిస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో చైర్మన్ గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 2016-17 సీజను ప్రారంభమైనందున విధులను సక్రమంగా నిర్వర్తించాలని, చెక్‌పోస్టు వద్దకు వచ్చే వాహనాల నుండి మార్కెట్ ఫీజు సక్రమంగా వసూలు చేసి లీకేజిలు లేకుండా చూడాలన్నారు. సిబ్బంది విధులకు గైర్హాజరు కాకుండా మార్కెట్ ఫీజు పెంచాలని, ధాన్యము, వేరుశనగ, అపరాలు, చేపలు, రొయ్యలు, సరుకు బాదులు వగైరాలకు మార్కెట్ ఫీజు టనే్నజి ప్రకారం వసూలు చేయాలని ఆదేశించారు. ఏ చెక్‌పోస్టులోనైనా అవకతవకలు జరిగినట్లు తెలిస్తే ఎవరినీ వదిలేది లేదని, తక్షణమే విధుల నుండి తొలగిస్తానని హెచ్చరించారు. అంతేకాక సిఎంఆర్ ధ్యానం లారీల నుండి ట్రక్ చిట్ ఉంటే మార్కెట్ ఫీజు వసూలు చేయవద్దని, ట్రక్ చిట్ లేకపోతే తప్పకుండా మార్కెట్ ఫీజు వసూలు చేయాలని పేర్కొన్నారు. 2016-17 సంవత్సరాలకు రూ.2.50కోట్లు మార్కెట్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఎంవి సుబ్బమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.