కృష్ణ

ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 22: గణిత మేధావి రామానుజన్ జయంతి వేడుకలను గురువారం మండలంలోని పలు పాఠశాలలలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంవి శ్రీనివాసరావు, కరస్పాండెంట్ పి రాజారెడ్డి రామానుజన్ జీవిత విశేషాలను వివరించి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని గణపవరం ప్రాథమిక పాఠశాలలో రామానుజన్ చిత్రపటానికి హెచ్‌ఎం పి గోపాల్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే రామానుజన్ మాదిరిగా గణితంలో ప్రావిణ్యత సంపాదించినట్లైతే అన్ని విషయాలలో సైతం అవగాహన ఏర్పడుతోందన్నారు. ఈకార్యక్రమం సందర్భంగా విద్యార్థులు గణిత నమూనాలు తయారు చేశారు. విలువలను తెలియజేశారు. ఇవి నిత్య జీవితంలో అందరికీ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యాకమిటీ చైర్మన్ డి రత్నకుమారి, కె అనిల్‌కుమార్, బి సూర్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్, పూర్ణచంద్రరావు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

26న కాంట్రాక్ట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ
* ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు
కూచిపూడి, డిసెంబర్ 22: కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఉద్యోగ భద్రత, సమస్యలపై ఈ నెల 26వతేదీన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుందని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్ ఓరియంటల్ పాఠశాల ఉపాధ్యాయులు, యుటిఫ్ జిల్లా కమిటీ సభ్యుడు పాగోలు రమేష్‌బాబు రూపొందించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఎమ్మెల్సీ నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 26వతేదీన సమావేశమయ్యే కేబినెట్ సబ్ కమిటీలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. పాత విధానంలో గ్రూప్-2 అభ్యర్ధులను ఎంపిక చేయాలన్నారు. గత ఎన్నికల్లో టిడిపి ఇచ్చిన రూ.2వేలు నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం జెడ్పీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కంప్యూటర్ టీచర్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులతో పాటు మ్యూజికల్, డ్రాయింగ్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వంట ఏజెన్సీలకు మూడవ అదనపు గుడ్డు నిధులతో పాటు బకాయి పడ్డ రెండు నెలల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. అంతకముందుగా గణిత శాస్తజ్ఞ్రుడు శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం జగదీశ్వరరావు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి మనోహర్ కుమార్, ప్రధాన కార్యదర్శి కెఎ ఉమామహేశ్వరరావు, కార్యదర్శి రామప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్ బాబు, మండల కార్యదర్శి చింతయ్య తదితరులు పాల్గొన్నారు.