కృష్ణ

క్రీస్తు బోధనలు సర్వమానవాళికి అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 23: యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఎస్‌ఎస్‌కే ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ డైరెక్టర్ గొల్లపూడి మోహనరావు అన్నారు. శుక్రవారం స్కూల్‌లో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా క్రిస్మస్ సందేశాన్ని వివరించారు. ప్రిన్సిపాల్ ఎం జాన్ లాజరస్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటితరానికి తెలియజెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఈకార్యక్రమంలో పాస్టర్ ఎం ప్రకాష్ బాబు దైవ సందేశాన్ని అందించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో
కోరుకొల్లు విద్యార్థుల ప్రతిభ
కలిదిండి, డిసెంబర్ 23: రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో కోరుకొల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. 9వ తరగతి విద్యార్థినులు కృష్ణ ప్రియాంక, నవ్య ప్రదర్శించిన ఇండియా బోర్డర్ సెక్యూరిటీ ఎగ్జిబిట్ దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు హెచ్‌ఎం నరహరశెట్టి శ్రీహరి తెలిపారు. జనవరి 5వతేదీన పాండిచ్చేరిలో జరిగే ప్రదర్శనలో ఈ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

వైభవంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు
నాగాయలంక, డిసెంబర్ 23: మండల సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శ్రీరామ పాదక్షేత్రం వద్ద గల శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వందలాది మంది దంపతులు స్వామివారి వ్రతాల్లో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. అన్నవరం నుండి వచ్చిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నవరం దేవస్థానం అర్చకులు నరసింహరావు, కూరపాటి రాధాకృష్ణమూర్తి నేతృత్వంలో సత్యవ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీరామపాద క్షేత్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎ శ్రీనివాసరావు, సమరసత ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, కన్వీనర్ రేమాల శ్రీనివాసరావు, క్షేత్రం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.