కృష్ణ

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు,డిసెంబర్ 25: మండలంలో క్రిస్మస్ పర్వదినాన్ని ఆదివారం క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు పుట్టిన శుభసందర్భంగా 16 గ్రామాల్లో చర్చిల్లో తెల్లవారుఝామున, మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. యేసుక్రీస్తు పుట్టుకతో లోకానికి వెలుగు వచ్చిందని కొవ్వొత్తులు చేతపట్టి పాటలు పాడుతు వీధుల్లో తిరిగారు. అనంతరం చర్చిల్లో పాస్టర్లు క్రీస్తు సందేశాలను వినిపించారు. దైవస్వరూపి చర్చిలో పాస్టర్ రాజారత్నం, మరనాత విశ్వాస సమాజము చర్చిలో పాస్టర్ వల్లూరు చంద్రశేఖర్, ఆర్‌సీఎం చర్చిలో పాధర్ రాయప్ప దైవసందేశాలు అందించారు. పాపులను రక్షించేందుకు యోహోవా దేవుడు ఆజ్ఞమేరకు పరిశుద్ధాత్మ వరంతో కన్యయైన మరియమ్మకు క్రీస్తు జన్మించాడని సంఘ పాస్టర్లు బోధించారు. ప్రతివ్యక్తి క్రీస్తు ఆజ్ఞలను పాటించాలన్నారు. పలు చర్చిల్లో భక్తులు సహంపంక్తి భోజనాలు జరుపుకున్నారు.

చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
గుడ్లవల్లేరు: మండలంలోని అన్ని గ్రామాలలోని చర్చిలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆదివారం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కూరాడ గ్రామంలోని ది ఫెయిత్ వర్శిప్ మినిస్ట్రీ చర్చిలో రెవ. లింగం జాన్‌బెన్నీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పేదలకు రాష్ట్ర న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు చేతులు మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ చర్చిలలో ఏర్పాటు చేసిన క్రీస్తు జనన ఘట్టాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
నాగాయలంకలో...
నాగాయలంక : మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం క్రిస్మస్ సందర్భంగా ఆయా ప్రార్థనా మందిరాలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే అన్ని వయస్సుల వారు తమ సమీపంలోగల చర్చిలకు వెళ్ళి స్థానిక మత పెద్దలు అందించిన బోధనలను శ్రద్ధగా ఆలకించారు. క్రీస్తు జననం లోకానికే వెలుగని, ఆ వెలుగులోనే మానవులంతా ప్రేమతో మెలగాలని మత పెద్దలు ప్రబోధించారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని అన్ని ప్రార్థనా మందిరాలలో కేక్ కట్ చేశారు.
మొవ్వలో...
కూచిపూడి : పేద, గొప్ప భేదాలు లేకుండా మొవ్వ మండలంలోని అన్ని గ్రామాలలో క్రిస్మస్ పండుగను ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. గ్రామాలు విద్యుత్ దీపకాంతులతో, స్టార్లతో నూతన శోభను సంతరించుకున్నాయి. చర్చిలు శోభాయమానంగా విరాజిల్లాయి. స్థానిక ఆర్‌సిఎం చర్చిలో పాదర్ గడ్డం చిన్నజోజిబాబు ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఏసుక్రీస్తు జననానికి ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సంఘ కాపరులు భక్తులను ఆహ్వానించి ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదర్ లాజర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధూపం, సమష్టి దివ్య పడిపూజ, దివ్య సత్‌ప్రసాదం, బాల ఏసు లాలింపు, కేక్ కట్‌చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఫ్రాంక్ డేవిడ్ చర్చి, బేతేల్ చర్చి, లైవ్‌గీవర్స్ అసోసియేషన్, యువంజీయేల్ చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఆదివారం తెల్లవారుఝామున క్యాండిల్స్‌తో చర్చిలలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం నూతన వస్త్రాలు ధరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
కృత్తివెన్నులో..
కృత్తివెన్ను: కృత్తివెన్ను మండల ప్రజలు క్రిస్మస్ పర్వదినాన్ని ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. శనివారం రాత్రి నుండే ప్రార్థనాలయాలకు వెళ్ళి లోకరక్షకుడు యేసు క్రీస్తును ఆరాధించారు. క్రీస్తు రాకను సూచిస్తూ అర్ధరాత్రి 12గంటలకు క్రిస్మస్ కేక్‌లు కట్ చేశారు. క్యాండెల్స్‌తో ప్రదర్శన నిర్వహించారు. అన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.