కృష్ణ

మానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 25: సర్వమానవాళికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక పెదదళితవాడలోని ఆర్సీఎం చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపులను రక్షించుటకే ఈలోకంలో ఏసుక్రీస్తు జన్మించాడన్నారు. యేసు చెప్పిన విధంగా అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ సోదరభావంతో మెలగాలన్నారు. శాంతి, దయ,
ప్రేమ, కరుణ కలిగి ఉండాలని యేసు తన బోధనలలో చెప్పారని ఆయన బోధనలు అందరికీ ఆదర్శం కావాలన్నారు. క్రిస్మస్ పర్వదినం పేదల పండుగని, పేదలంతా పర్వదినాన్ని సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న క్రిస్మస్ కానుక పేరుతో పిండి వంటలకు అవసరమైన సరుకులను ఉచితంగా అందించినట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై చంద్రబాబు అహర్నిశలూ శ్రమిస్తున్నారని యేసు ప్రభువు ఆయన భగీరథ యత్నానికి అవసరమైన ఆశీస్సులు అందించాలని అందరూ కోరుకోవాలని మంత్రి ఉమ సూచించారు. అనంతరం సర్పంచ్ నందేటి కృష్ణవేణి సౌజన్యంతో పేద వృద్ధులకు చీరలు మంత్రి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి బాణావతు లక్ష్మి, ఉపసర్పంచ్ షహానాబేగం, పార్టీ నేతలు పాల్గొన్నారు.

నేటి నుండి రోజు విడిచి రోజు మంచినీరు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 25: పట్టణ ప్రజలకు నేటి నుండి రోజు విడిచి రోజు కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేయనున్నట్లు కమిషనర్ జస్వంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడ్‌వాటర్ ఛానల్‌కు నీటి పారుదల శాఖ నీటి సరఫరాను నిలిపి వేయటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.