కృష్ణ

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి క్రీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వత్సవాయి, డిసెంబర్ 30: విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు దోహదపడతాయని మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. మండలంలోని గోపినేనిపాలెం ఉన్నత పాఠశాలలో ఏడు రోజులుగా నిర్వహించిన 80వ గ్రిగ్ సబ్ జోన్ ఆటల పోటీలు శుక్రవారం ఘనంగా ముగిసాయి. ఈ నెల 22,23 తేదీల్లో బాలికలకు, 27 నుండి 30 వరకూ బాలురకు క్రీడా పోటీలు నిర్వహించారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న నెట్టెం రఘురాం మాట్లాడుతూ 80 సంవత్సరాలుగా గ్రిగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీయవచ్చని అన్నారు. గెలుపు ఓటములు సహజమని, కానీ క్రీడలు పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతేనని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మల్లెల గాంధీ, హెచ్‌ఎం అజ్మీరు కొండ, డివైఇఒ చిట్టిబాబు, ఎంఇఒ వీరస్వామి, గ్రామస్తులు పొన్నం పెంటయ్య, గింజుపల్లి వీరబాబు, సర్పంచ్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

2వ రైతు బజారుకు స్థల పరిశీలన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 30: ప్రజల అవసరాలు మేరకు జిల్లా కేంద్రం మచిలీపట్నంలో అదనంగా రైతు బజారును ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణరావు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై శుక్రవారం మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, మార్కెటింగ్ డిఇ ప్రసాద్ రాజుపేటలోని ఈ-సేవా కేంద్రం వెనకాల ఉన్న స్థలాన్ని పరిశీలించారు. రైతుబజారు నిర్మాణానికి స్థలం అనుకూలంగా ఉందని చైర్మన్ గోపు సత్యనారాయణ తెలిపారు. 2వ రైతు బజారు ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ వద్ద ఉన్నాయన్నారు. అక్కడి నుండి తమ కార్యాలయానికి ప్రతిపాదనలు అందాయన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలు రూపొందించి నిధులు సమకూర్చుకుని రైతు బజారు నిర్మాణానికి కృషి చేస్తామని చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబజారు ఎస్టేట్ ఆఫీసర్ బలిచక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

షెల్ గ్యాస్ వెలికితీతను మానుకోవాలి
* రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల డిమాండ్
కైకలూరు, డిసెంబర్ 30: ఓఎన్‌జిసి చేపడుతున్న షెల్ గ్యాస్ తవ్వకాల వల్ల భూమి సారం కోల్పోయే ప్రమాదం వుందని, పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలుగుతుందని, ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం వుందని, జీవకోటి అంతరించిపోయే సూచనలున్నాయని, ఈ నేపథ్యంలో భూమి నుంచి షెల్ గ్యాస్ వెలికితీతను నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీతారామ ఫంక్షన్ హాలులో సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. షెల్ గ్యాస్ వెలికితీత వల్ల సంభవించే ప్రమాదాన్ని వివరించారు. ఈ తవ్వకాల వల్ల నష్టమేమీ లేదని ప్రకటించినా రాబోయే తరంలో తీవ్ర ప్రమాదం పొంచి వుందని తెలిపారు. డ్రిల్లింగ్ సమయంలో భూగర్భం నుంచి వచ్చిన కలుషిత ద్రవాన్ని భూమిపైనే వదిలివేస్తున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం అవటంతోపాటు భూమి సారం కోల్పోతుందని తెలిపారు. సమావేశంలో పర్యావరణానికి హాని కలిగించే షెల్ గ్యాస్ వెలికితీతను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. జనవరి 22న భీమవరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కట్టా నాగరాజు గౌడ్, చిలుకూరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.