కృష్ణ

అధికారులపై దౌర్జన్యం గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 3: మహిళలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని లేనిపోని ఆశలు చూపి రూ.100కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యానికి పాల్పడటం గర్హనీయమని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుమ్మరిగూడెంలోని ఆర్‌ఎస్ నెం.180, 181లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి గత కొనే్నళ్లుగా నిర్వీర్యంగా పడి ఉందన్నారు. దీన్ని గుర్తించిన తమ ప్రభుత్వం ఆ స్థలంలో రూ.2కోట్లతో అవుట్ అండ్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పూనుకుందన్నారు. చిన్నపాటి వర్షానికే మురుగున పడే ఆ భూమిని మెరక చేసేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం గర్హనీయమన్నారు. కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే సుమారు ఎకరం భూమికి హైకోర్టు నుండి స్టేటస్‌కో ఆర్డర్ తెచ్చుకున్నారని, ఆ భూమిని మినహాయించి అధికారులు అభివృద్ధికి పూనుకుంటే పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలకు మేం అధికారంలోకి వచ్చాక ఇళ్ల స్థలాలు ఇస్తాం, ప్రభుత్వ చర్యలను అడ్డుకోండని ఉసిగొలిపి లేనిపోని అల్లర్లకు ప్రతిపక్షం కారణమైందన్నారు. భయానక వాతావరణం సృష్టించి అధికారులను పారిపోయే పరిస్థితులు తీసుకు వచ్చారని ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షం ఎన్ని అల్లర్లు సృష్టించినా స్టేడియం నిర్మాణాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ సాతులూరి నాంచారయ్య, టిడిపి నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, ఇలియాస్ పాషా, కాసగాని భాగ్యారావు, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
* భర్తను అరెస్టు చేయాలంటూ బంధువుల రాస్తారోకో
అవనిగడ్డ, జనవరి 3: నాగాయలంక మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన కర్రా ప్రసన్న అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో తక్షణమే ఆమె భర్తను అరెస్టు చేయాలంటూ బంధువులు అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన కర్రా ప్రసన్నకు మెరకనపల్లికి చెందిన కొండలుతో గత పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో పుట్టింటికి చేరుకుంది. పెద్ద మనుషుల జోక్యంతో ఆమెకు సర్దిచెప్పి తిరిగి అత్తింటివారికి పంపారు. అయినా ప్రసన్న కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆమెకు జ్వరం రావటంతో నాగాయలంక ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా అనుమానించిన పోలీసులు శవపరీక్ష కోసం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇటు కొండలు బంధువులకు, అటు ప్రసన్న బంధువులకు వివాదం జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రసన్న తరఫు బాధితులు ప్రసన్న భర్త కొండలను తక్షణమే అరెస్టు చేయాలని రాస్తారోకోకు దిగారు. అంతట అవనిగడ్డ, నాగాయలంక ఎస్‌ఐలు ఆందోళన కారులతో చర్చలు నిర్వహించి ఎట్టకేలకు కొండలును అదుపులోకి తీసుకోవటంతో రాస్తారోకో విరమించారు. ప్రసన్న కుమారుడు రాకేష్ తనకేమి తెలియదని, తన తల్లిని ఎవ్వరూ కొట్టలేదని చెబుతున్నాడు. కాగా 2వ కుమారుడు రంజిత్ తన తల్లిని కొట్టినట్లు చెబుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.