కృష్ణ

నగదు రహితంలో దేశంలో మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 9: నగర రహిత చెల్లింపుల్లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిజిధన్ మేలాను సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్, నీతి ఆయోగ్ అడ్వైజర్ అశోక్ కుమార్ జైన్, జిల్లా కలెక్టర్ బాబు ఎ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ నగదు రహిత చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు డిజిధన్ మేలా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వ్ బ్యాంక్ అధికారులతో టెలీ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మన రాష్ట్రంలో సంక్షోభాన్ని అధిగమించారు. నగదు రహిత చెల్లింపులు నిర్వహిస్తూ మన రాష్ట్రం, జిల్లా, దేశంలోనే మొదటి స్థానంలో ముందుకెళుతుందన్నారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ నగదు రహిత చెల్లింపులు నిర్వహించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం 30 శాతానికి పైగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయని, దీనిని మరింత విస్తృతం చేయాలన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే డిజిధన్ మేలాను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేలాలో నగదురహిత విధానంలో ఎవరికి ఎటువంటి సందేహాలు వచ్చిన వెంటనే బ్యాంకర్లు వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు ఊపందుతుకున్నాయన్నారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నగదు రహిత చెల్లిపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా నగదు రహిత చెల్లింపులు గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని అమలు చేయాలన్నారు. ఈ విధానం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. నీతి ఆయోగ్ సలహాదారు అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ దేశంలోనే వంద డిజిధన్ మేలా కార్యక్రమాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదటి డిజిధన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించే నగదు రహిత చెల్లింపులు డిజిధన్ మేలాను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేలా ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా 678 జిల్లాల లక్కీడ్రాకు ఎంపిక కాగా అందులో 4వేల మంది మన రాష్ట్రం వారు అవడం మనకెంతో గర్వకారణమన్నారు. డిజిధన్ మేలాను రైతులు, మహిళలు, విద్యార్థులు నగదు రహిత లావాదేవీలు, వివిధ యాప్‌ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎపిఎస్ ఆర్టీసీ ఇప్పటికే 15 శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తూ మొదటి స్థానంలో ఉందన్నారు.