కృష్ణ

నాల్గవ రోజూ కొనసాగిన జూద జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జనవరి 16: ధనార్జనే ధ్యేయంగా సంప్రదాయం కొనసాగింపు ముసుగులో కొంత మంది నిర్వహిస్తున్న జూద జాతర సోమవారం నాల్గవ రోజూ కొనసాగింది. సంక్రాంతి సంప్రదాయం పేరిట కోడి పందాల నిర్వహణకు సంబంధిత అధికారులు నుండి నయానో భయానో వౌఖిక అనుమతులు తీసుకుని భోగి రోజు నుండి యథేచ్చగా నిర్వహిస్తున్న పలు రకాల జూదాలు కొనసాగాయి. వేల సంఖ్యలో కత్తికట్టిన కోళ్లు నెత్తురొడుతూ వీక్షకులకు నయనానందాన్ని కలుగజేశాయి. ఈ విషయంలో అధికారులు కోర్టు ఆదేశాలను, లోకాయుక్త కఠిన నిర్ణయాలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. వెంకటాపురం, పాగోలు, ఘంటసాల మండలం పాపనేశ్వరం, కొడాలి గ్రామాలలో ప్రధాన రహదారుల సమీపంలోనే పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి జూద జాతరలు సాగించారు. భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో రూ.2కోట్లకు పైగా జూదాలలో నగదు చేతులు మారినట్లు ఒక అంచనా కాగా, నాల్గవ రోజైన సోమవారం ఒక్కరోజే కోటి రూపాయలు పైబడి జూదాలు జరిగినట్లు తెలుస్తోంది. కోడి పందాలకు తోడు పేకాట, చిత్తులాట, గుండాట, కాయ్‌రాజా.. కాయ్, చిన్న బజార్, పెద్ద బజార్, సినిమా హిరో, హీరోయిన్లు, లక్కీవీల్, కలర్స్ వంటి జూదాలు జనం జేబులకు చిల్లులు పెట్టాయి. కనుమ రోజుతో పందాలు, జూదాలు ముగుస్తాయన్నప్పటికీ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి నిర్వహకులు నాల్గవ రోజూ నిర్భీతిగా జూద క్రీడలను కొనసాగించినట్లు తెలుస్తోంది. కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన పందెం రాయుళ్లు, జూద గాళ్లకు నిర్వహకులు ఫోన్‌లు చేసి సమాచారం అందించటంతో పెద్ద ఎత్తున వారు బరులకు చేరుకున్నట్లు పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. సోమవారం ఒక్కో పందెం రూ.లక్షన్న వరకు నిర్వహించినట్లు తెలుస్తోంది. బరులలో గత మూడు రోజులుగా నిత్యకృత్యమైన ఘర్షణలు, గొడవలు నాల్గవ రోజు కొనసాగినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దుతో గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కొనసాగినప్పటికీ కోడి పందాల బరులలో కరెన్నీ కొరత కనపడకపోవటం విశేషం.
టమాటాను పట్టి పల్లార్చుతున్న వైరస్ తెగుళ్లు
మోపిదేవి, జనవరి 16: మండల పరిధిలోని కోసూరువారిపాలెం, చిరువోల్లంక తదితర గ్రామాలలో సుమారు 150 ఎకరాలలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. వివిధ దశలలో ఉన్న టమాటా పైరు వైరస్ తెగుళ్లు సోకి నల్లగా ఆకులు మాడటంతో పాటు పూత, పిందె తగ్గిపోతుంది. కొంత మంది రైతులు టామాటా పైరును దుక్కిదున్ని పంట మార్పిడి చేస్తున్నారు. మరికొంత మంది నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.