కృష్ణ

త్వరలో పట్టాలెక్కనున్న అధునాతన రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 17: ఎక్కడో ఇతర దేశాల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన రైళ్లు నడుస్తున్నాయని పేపర్లో ఫోటోలు, ఇంగ్లీషు సినిమాల్లో అప్పుడప్పుడూ భారతీయులు చూసుంటారు. కాని ఒక్కసారిగా అటువంటి రైలు భారతదేశంలో అతి త్వరలో నడుస్తుందంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే భారత రైల్వే మంత్రిత్వపు శాఖ ఇండియన్ రైల్వేలోని ప్రయాణికుల సేవల్లో నూతన అధ్యాయంలో భాగంగా మరో అడుగు ముందుకేసింది. అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా విభిన్న తరహాలో ముందుకేస్తున్న అడుగుల్లో హైస్పీడ్ రైళ్లను సైతం ప్రవేశపెడుతున్నది. ఇందులో భాగంగానే విభిన్న ప్రయాణికుల సౌకర్యాల పేరుతో మార్పును సైతం సంతరించుకుంటున్నాయి. అందుకోసం ఇండియన్ రైల్వే విభిన్నమైన తరహాలో రైల్వే సేవలను ప్రయాణికుల చేరువలోకి తీసుకురానుంది. అందులో భాగంగానే భారతీయ రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు విలాసవంతమైన లగ్జరీ సౌకర్యాలు గల రైలు సర్వీస్‌ను ఇండియన్ రైల్వేలో శ్రీకారం చుట్టారు. పూర్తిస్థాయిలో ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో పరిచయం చేయనున్న ‘హమ్ సఫర్’ రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. త్రీటైర్ స్లీపర్ కోచ్‌లతో నిర్మించబడిన ఈ హోమ్ సపర్ రైలులో పూర్తిగా ఎయిర్ కండిషనింగ్‌తో రూపొందించారు. ఈ రైలును భారతదేశంలోని భారతీయ రైల్వేలో ‘పుల్లీ ఎయిర్ కండిషన్డ్’ రైలుగా కూడా పిలువవచ్చు. హమ్ సఫర్ రైలులో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇందులో అటు, ఇటు చివర రెండు బోగీల్లో హైపవర్ జనరేటర్లు వుంటాయి. ఇక రైలు బోగీలకు బయట ఇరువైపులా లేత నీలం రంగు పూలను పై నుంచి కిందకు జారవిడిచినట్లుగా పెయింటింగ్ చేయించారు. హమ్ సఫర్ రైలులోని అన్ని బోగీల్లో సిసి టివి కెమెరాలు, జిపిఎస్ ఫెసిలిటీ ద్వారా రైలు నడుస్తున్న సమయంలో రైలు వెళుతున్న ప్రదేశం, తరువాత రానున్న స్టేషన్‌తో పాటు చేరుకోవాల్సిన ప్రదేశం వంటి పలు వివరాలను ప్రయాణికులు పొందవచ్చు. ఇందులో ప్రత్యేకంగా అంధుల కోసం బ్రెయిలీ తెరని కూడా ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ప్రయాణికుల సౌకర్యార్ధం అనేక ఇతర ఫీచర్లను సైతం ఏర్పాటు చేశారు. అలాగే రైలులో టీ, కాఫీ వంటి సౌకర్యాల కోసం వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యార్ధం మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ చార్జింగ్ చేసుకోవడం కోసం ప్రతి బెర్త్ వద్ద చార్జింగ్ పాయింట్ బోర్డులు బిగించారు. హమ్ సఫర్ రైలులోని చాలావరకు బెర్త్‌లు అత్యంత సౌకర్యవంతంగా, సుఖవంతమైన ప్రయాణం సాగించడం కోసం రూపుదిద్దబడ్డాయి. రైలులోని లోపల భాగంలో ఫ్లోర్ మొత్తం ‘వినైల్ షీట్ల’తో రూపొందించారు. స్టాండర్డ్ ఆక్ససరీలతో ఆకర్షణీయమైన పెయింటింగ్‌ని చిత్రీకరించారు. బాత్‌రూమ్‌లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. విదేశీ సొబగులు గల టాయిలెట్లను రూపొందించారు. ప్రయాణికులు ఆరోగ్యకరమైన ప్రయాణం కోసం చెత్తను రైలులో ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా అందుకోసం ప్రత్యేకమైన చెత్త కుండీలను అక్కడక్కడ ఏర్పాటు చేశారు. ఇండియన్ రైల్వే ఈ హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను కపుర్తలాలోని రైల్‌కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిర్మాణానికి దాదాపు 2.6 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా త్వరలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే చివరగా ప్రయాణికులు చూడదగిన విషయమేమిటంటే ఇన్ని హంగులతో అత్యాధునికంగా రూపుదిద్దుకుని ప్రయాణికుల సేవలోకి వచ్చే ఈ రైలు చార్జీల విషయంలో సాధారణ రైళ్లల్లో ప్రయాణపు చార్జీల కంటే ఈ హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలో 20శాతం ఎక్కువ చెల్లించాల్సి వుంటుంది. ఈ రైలులో ఏదైనా మంటలు ఏర్పడితే వాటిని అదుపుచేయడం కోసం ప్రతి బోగీలో అదనంగా అగ్నిమాపక నిరోధక సిలెండర్‌ని ఏర్పాటుచేశారు. ఈ బోగీలన్నీ కూడా అధునాతన విధానంతో తయారుచేయబడుతున్నాయి. త్వరలో భారతీయ రైల్వేలోని ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

ఘనంగా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 17: పట్టణంలో సంగీత జగద్గురు త్యాగరాజ స్వామి 175వ ఆరాధనోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈడేపల్లి జోడుగుళ్ల ప్రాంగణంలోని కళావేదికలో శ్రీ విజయవాణి సంగీత కళాశాల గురువు మొదలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాళీపట్నపు ఉమ, ఎల్ విజయలక్ష్మి, సింగరాజు కల్యాణి, కంతేటి ఉష, మొదలి కామేశ్వరి వౌనిక తదితరులు పంచరత్న కీర్తనల బృందగానం నిర్వహించారు. వయోలిన్‌పై జగన్మోహిని, వయోలిన్‌పై దక్షిణామూర్తి వాద్య సహకారం అందించారు. అనంతరం కళాశాల విద్యార్థులు దీప్తి కిరణ్మయి, అనిరుద్, శ్రీరామ్, వర్షిణీ తదితరులు త్యాగరాజ కృతులను ఆలపించారు. తొలుత త్యాగరాజ స్వామికి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బుట్టాయిపేట వివేకానంద మందిరంలో శ్రీ త్యాగరాజ సంగీత విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కల్లూరి శ్రీనివాస్ (విజయవాడ) గాత్ర సంగీత సభ నిర్వహించారు. అనంతరం వడ్లమన్నాటి మహేష్ ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి విరచిత ఘనరాగ పంచరత్న కీర్తనల బృందగానం జరిగింది. వాయులీనంపై విష్ణ్భుట్ల పూర్ణ గాయత్రి శివాని, మృదంగంపై కందుల అనిల్ కుమార్ వాద్య సహకారం అందించారు. సంగీత కళాకారులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.