కృష్ణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 17: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ఆదేశించారు. ప్రత్యేక తరగతుల ద్వారా రానున్న పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతి రోజూ రెండు పూటలా పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు ప్రారంభించాలని మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థారుూ సంఘ సమావేశాల్లో జిల్లా విద్యా శాఖాధికారి ఎ సుబ్బారెడ్డిని ఆదేశించారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నప్పటికీ చాలా పాఠశాలల్లో వౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. డిఇఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సిలబస్ పూర్తయినట్టు తెలిపారు. ఫిబ్రవరి 1వతేదీ నుండి 40 రోజుల పాటు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. 125 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరువూరు మండలం జెడ్పీ పాఠశాలల్లో, గంపలగూడెం మండలం తునికిపాడు, ఊటుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లు, కైకలూరు మండలం భుజభలపట్నం జెడ్పీహెచ్‌ఎస్‌ల్లో అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఆయా మండల జెడ్పీటిసిలు చైర్‌పర్సన్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పిహెచ్‌సి ఆవరణలు అడవులను తలపించే విధంగా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, వీటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ అనూరాధ సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పిహెచ్‌సిలకు మరమ్మతులు నిర్వహించాలన్నారు. అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 104 సంచార వాహనాలు గ్రామాలకు ఎప్పుడు వస్తున్నాయో తెలియడం లేదని కొంత మంది జెడ్పీటిసిలు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన ఆమె 104 సంచార వాహనాల పర్యటన, షెడ్యూల్‌ను మండల ప్రజా ప్రతినిధులకు విధిగా తెలియచేయాలన్నారు. జనవరి 29వతేదీన తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య రక్ష పథకం కింద నెలకు రూ.100లకే రూ.2లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్‌పర్సన్ తెలిపారు. అయితే దీనిపై తగిన స్థాయిలో ప్రచారం కొరవడిందన్నారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి అంశంపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు రేషన్ పంపిణీలో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకు వచ్చారు. వృద్ధుల వేలి ముద్రలు పడని కారణంగా రేషన్ తీసుకోలేకపోతున్నారన్నారు. జెడ్పీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా జరుగుతున్న సర్వేలో సర్వే శాఖాధికారులు సహకరించాలని చైర్‌పర్సన్ కోరారు. జెడ్పీ ఆస్తులు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొట్ట మొదటిసారిగా పౌష్ఠికాహారం, చిరుధాన్యాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఆరోగ్య జ్యోతి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించామని, ఇదే విధంగా మండలాల్లో కూడా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవన నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. 2016-17 సవరణ బడ్జెట్ అంచనాలు, 2017-18 బడ్జెట్ అంచనాలు సమావేశంలో ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం ఈ నెల 27వతేదీన జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో దీని ఆమోదించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దామోదర నాయుడు, జెడ్పీ వైస్ చైర్మన్ శాయన పుష్పవతి, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, ఐసిడియస్ పిడి కృష్ణకుమారి, డ్వామా పిడి మాధవీలత, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

23 టన్నుల పిడియస్ బియ్యం పట్టివేత
హనుమాన్ జంక్షన్, జనవరి 17: బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం వద్ద మంగళవారం ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. విజిలెన్స్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు 23 టన్నుల రేషన్ బియ్యాంతో లారీ బయలుదేరింది. విజిలెన్స్ ఎస్సి రవీంద్రనాథ్‌కు వచ్చిన సమాచారం రావడంతో అయన సిఐ వెంకటేశ్వర్లును తనీఖీలు నిర్వహించమని అదేశించారు. దీంతో బాపులపాడు డిటి రామకోటేశ్వరరావుతో కలసి వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై తనీఖీలు నిర్వహించారు. నకిలీ బిల్లులను తయారుచేసి తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలో 23 టన్నుల 260 కేజిల రేషన్ బియ్యం వున్నట్లు అధికారులు గుర్తించారు. లారీ డ్రైవర్ ఎమ్‌డి బాషాను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ పోలీసులు అతనిని వీరవల్లి పోలీసులకు అప్పగించారు. బియ్యం వ్యాపారి దర్శి సుబ్బారావుపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 10 గంటలకు లారీని పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం తెలపకపోవడం, బియ్యం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్ళుతున్నదనే వివరాలు వెల్లడించలేదు.