కృష్ణ

రాష్ట్భ్రావృద్ధిలో స్పేస్ టెక్నాలజీదే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 19: రాష్ట్భ్రావృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకం కానుందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం, ఎపి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో డిసిమేషన్ ఆఫ్ గాస్పియల్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్ అనే అంశంపై ఒక రోజు జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ను మంత్రి కొల్లు రవీంద్ర పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందు ఉంటారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబు ఐటిని ప్రమోట్ చేయడం ద్వారా ప్రపంచంలో మేటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారన్నారు. తద్వారా హైదరాబాద్ ఐటి రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిలో భాగంగా మొట్ట మొదటిసారిగా మచిలీపట్నంలో జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. భూ వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు విశే్లషణ చేస్తూ భూగర్భ జలాలు ఉనికిని గుర్తించడం ద్వారా ఏ ప్రాంతంలో భూములు ఏ పంటలకు అనువైనవి, పంట అంచనా తదితర అంశాలపై రైతులకు విలువైన సమాచారం అందించి సారవంతమైన నెలలో పంటలు పండించడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చన్నారు. ఇందుకు శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. భూగర్భ జలాల పరిమితి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫిజియో మీటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్పేస్ టెక్నాలజీ ఎంతగానో వినియోగించుకుంటున్నామని, రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా గృహ నిర్మాణ రంగంలో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు గృహాలు జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు చెప్పారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా భూ రికార్డులన్నింటినీ ఆన్‌లైన్ చేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడాదికి 60 రోజులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అధ్యయానికి వినియోగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ప్రపంచంలో దూసుకుపోతుందని, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని వాతావరణ పరిస్థితులు అంచనా వేయడానికి, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలను ముందుగా గుర్తించడం వల్ల అపార నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. హుదూద్ తుఫాన్ ఇందుకు ఉదాహరణ అన్నారు. సిఆర్‌డిఎ పరిధి నిర్ణయంలో కొన్ని పొరపాట్లు జరగటంతో మచిలీపట్నం ప్రాంతంలో వేలాది ఎకరాలు, కొన్ని గ్రామాలు సిఆర్‌డిఎ పరిధిలో చూపుతుండటం వల్ల నిరుపయోగంగా మారాయని, అసలైన సిఆర్‌డిఎ పరిధిలో నిర్ధారించాలని సదస్సులో పాల్గొన్న శాస్తవ్రేత్తలను ఎంపి కొనకళ్ల కోరారు. తద్వారా నిరుపయోగంగా ఉన్న భూములు వినియోగంలోకి వస్తాయన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఇస్రో) డైరెక్టర్ ప్రొ. వైవిఎన్ కృష్ణమూర్తి, రాష్ట్ర ఉన్నత విద్య కార్యదర్శి ప్రొ. ఎస్ వరదరాజన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ డా. కెవి రమణ, కృష్ణా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. డి సూర్యచంద్రరావు, స్పెషల్ ఆఫీసర్ ప్రొ. ఎంవి బసవేశ్వరరావు, ప్రిన్సిపాల్ ప్రొ. వైకె సుందరకృష్ణ, ఫ్యాకల్టీలు, విద్యార్థులు పాల్గొన్నారు.