కృష్ణ

అభివృద్ధిని కుంటుపరుస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, జనవరి 20: నిరుపేదలకు సైతం వేలిముద్ర లేదని క్రిస్మస్, సంక్రాంతికి చంద్రన్న కానుకలు అందక ఎందరో నిరుపేదలు ఎదురు చూస్తున్నారని కైకలూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపి అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కలిదిండి ప్రధాన సెంటరులో గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ సిఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకు మాత్రమే అమరావతి, సీటుకోసమే చంద్రబాబు పాట్లుపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నీలపాల వెంకటేశ్వరరావు, జిల్లా బిసి కార్యదర్శి కందుల వెంకటేశ్వరరావు, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎస్‌కె ఛాన్, యార్ల జీవరత్నం, పి నాంచారయ్య, మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు ప్రణాళికలు సిద్ధం
* డివైఇఓ కోటేశ్వరరావు
కూచిపూడి, జనవరి 20: రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు అవసరమైన వౌలిక సదుపాయాలు, ఇతర సమాచారాన్ని అందచేయాలని ఇన్‌ఛార్జి డివైఇఓ బాణావత్ కోటేశ్వరరావు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మొవ్వ ఎంఆర్‌సి భవనంలో శుక్రవారం మండలంలోని వివిధ పాఠశాలల హెచ్‌ఎంల సమావేశంలో ఆయన సమాచారం అందించాల్సిన విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈనెల మార్చి నెల 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను బందరు డివిజన్‌లోని 128 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన రూ.9,212 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు దృష్టి సారించినట్లు తెలిపారు. 53 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొవ్వ మండలంలోని ఆరు పరీక్షా కేంద్రాల ద్వారా 679 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశం హెచ్‌ఎంలు, సిఆర్‌పిలు ఆంజనేయులు, సమర్పణరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.