కృష్ణ

కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా క్రీడా మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జనవరి 20: స్థానిక కేంద్రీయ విద్యాలయంలో శుక్రవారం వార్షిక క్రీడా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్ కంపెనీ అడిషనల్ జనరల్ మేనేజర్, విద్యాలయం మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ డికెఆర్‌కె రవి ప్రసాద్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కల్నల్ జఖారియా, మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, విఎంసి సభ్యుడు డా. కె ఫణికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విద్యార్థినీ విద్యార్థుల మార్చ్ పాస్ట్ ఆకట్టుకుంది. క్రీడా పోటీ విజేతలకు అతిథుల ద్వారా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు వివిఎ భాస్కరమూర్తి, వ్యాయామోపాధ్యాయులు బిబిబివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అప్పిడి కిరణ్

మైలవరం, జనవరి 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న కిరణ్ తర్వాత జగన్ వెంట నడిచారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని జగన్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. నియామక పత్రాన్ని అందుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌ను శుక్రవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా పార్టీలో తన సేవలను గుర్తించి తనకు పదవి రావటానికి కృషి చేసిన పార్టీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి, ఉదయభాను, జిల్లా అధ్యక్షులు కె పార్థసారధి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, నియోజకవర్గ నాయకులు అప్పిడి సత్యనారాయణ రెడ్డిలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అక్రమ అరెస్టు గర్హనీయం
అవనిగడ్డ, జనవరి 20: గత నెల 25న అవనిగడ్డ నుండి చత్తీస్‌ఘడ్ వెళ్లిన నలుగురు ప్రజా సంఘాల నిజ నిర్ధారణ బృందాన్ని దుమ్మగూడెంలో చత్తీస్‌ఘడ్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని ప్రజాస్వామిక వేదిక నేతలు, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కె కృష్ణ, టి సూరిబాబు, సింహాద్రి కృష్ణారావు, ఎస్ అంబేద్కర్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న పోలీసు వైఖరిని నిరసిస్తూ ఈనెల 23న ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో కృష్ణాజిల్లాలో ఉదయం 10గంటలు నుండి ధర్నాలు నిర్వహించటం జరుగుతుందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ దేశంలోని అటవీ ప్రాంతాలలో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు ప్రజలపై నిర్భందాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుకుమ జిల్లాలో ఆదివాసి మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేయడం, గృహ దహనాలు నిత్యకృత్యమైనాయన్నారు. అక్కడ జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి వెళ్లిన నిజ నిర్ధారణ బృందాన్ని అరెస్టు చేసి జైలుకు పంపించటం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు లభించినా అవి కేవలం రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తులకే పరిమితమయ్యాయని, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు.