కృష్ణ

మద్యం లోడుతో మినీవ్యాన్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, జనవరి 24: మద్యం లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడిన ఘటన జి.కొండూరులో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గొల్లపూడి వీఆర్‌ఎల్ పాయింట్ నుంచి 201 బీరు కేసులు, 56 లిక్కర్ కేసులతో కూడిన మినీ వ్యాన్, చాట్రాయి మండలం, చనుబండకు వెళ్తోంది. మార్గమధ్యంలో జి.కొండూరులో మెరక మీద ఉన్న వైన్‌షాప్‌నకు సమీపంలో లారీని ఓవర్ టేక్ చేస్తుండగా, ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయిన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో మినీ వ్యాన్ అక్కడికక్కడే రోడ్డుపై తిరగబడి పడిపోయింది. స్థానికులు గుర్తించి అతి కష్టంమీద లోపల ఇరుక్కున్న మైలవరానికి చెందిన డ్రైవర్ తట్టెల ప్రభను వెలుపలికి తీశారు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ గాయాలు కాలేదు. కానీ వ్యానులో రవాణా చేస్తున్న రూ.6లక్షల విలువైన బీరు, లిక్కర్ సీసాలు పగిలిపోగా, మద్యం రోడ్డుపై ప్రవహించింది. మద్యం ఉచితార్ధంగా నేలపాలయిందని మందుబాబులు బాధపడ్డారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని పక్కకు తొలగించారు.
27న జెడ్పీ సర్వసభ్య సమావేశం

మచిలీపట్నం, జనవరి 24: ఈ నెల 27వతేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జెడ్పీ సిఇఓ టి దామోదరనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి సభ్యులు, అధికారులు విధిగా హాజరు కావాలని సిఇఓ కోరారు.
రెండవ రోజుకు చేరిన అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక దీక్షలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 24: తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న నిరవధిక నిరసన దీక్షలు మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరాయి. 2వ రోజు దీక్షలో నూజివీడు బ్రాంచ్ పరిధిలోని బాధితులు పాల్గొన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, కెవిపిఎస్ నాయకుడు సాల్మన్ రాజు, సిపిఐ నాయకుడు సురేష్, అగ్రిగోల్డ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు బాధితులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యండి రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.