కృష్ణ

అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 6: ఇలపర్రు దళితుల భూపోరాటంలో అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకుల అరెస్టులను నిరసిస్తూ సోమవారం స్థానిక లక్ష్మీటాకీసు సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ఇలపర్రు దళితులకు సంఘీభావంగా గత వారం రోజులుగా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఇలపర్రులో సిపిఎం నాయకులను అరెస్టు చేశారన్న సమాచారం అందుకున్న కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు దీక్షా శిబిరం నుండి లక్ష్మీటాకీసు సెంటరు వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), వైసిపి నాయకులు బొర్రా విఠల్, పిప్పళ్ల నాగబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త

చందర్లపాడు, పిబ్రవరి 6: వివాహితను మద్యం మత్తులో భర్త హత్య చేసిన సంఘటన మండలంలోని కోనాయపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన మార్కపూడి వజ్రమ్మ (24) ఆరోగ్యం చూపించుకోవటానికి హాస్పిటల్‌కు తీసుకువెల్లమని చెప్పగా భర్త రాంబాబుకు మధ్య గొడవ జరిగినట్లు తెలిపారు. రాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న వజ్రమ్మను గొంతుకు జాకెట్టు వేసి లాగగా మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు 4 నెలల గర్భిణి. ఈ సంఘటనపై ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ప్రారంభమైన వీరమ్మతల్లి తిరునాళ్ళు
ఉయ్యూరు, ఫిబ్రవరి 6: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు సోమవారం రాత్రి రంగ, రంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఆచారం ప్రకారం ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి రోజున ప్రారంభమయ్యే తిరునాళ్ళు ఈ ఏడాది ఒక రోజు ముందుగా ప్రారంభమవ్వనున్నట్లు ఆలయ కమిటీ ముందుగానే ప్రకటించింది. భీష్ట ఏకాదశి మంగళవారం కావడం, ఏకాదశి తిది మధ్యాహ్నం వరకు ఉండటంతో ముందురోజే అమ్మవారిని మెట్టినింటి నుంచి పుట్టినింటికి పంపేందుకు సిద్ధపడ్డారు. సోమవారం మధ్యాహ్నం నుంచే పట్టణ పురవీధులు భక్తుల రాకతో కిటకిటలాడాయి. అమ్మవారు బయలుదేరే సమయంలో భక్తులు సమర్పించే ఎదురుగండ దీపాలు, తిరుగు గండ దీపాల కోసం సాయంత్రం నాల్గు గంటల నుండే భక్తులు సిద్ధమయ్యారు. సంప్రదాయం ప్రకారం గ్రామ బాధ్యతలు స్థానిక గంగానమ్మతల్లికి అప్పగించేందుకు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ దేవాలయానికి తరలివెళ్ళిన వీరమ్మతల్లి అనంతరం ప్రభుత్వం తరపున పోలీసులు అందించే సారేను స్వీకరించింది. పోలీసు సిఐ జి.వి.వి సత్యన్నారాయణ దంపతులతో పాటు పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్ దంపతులు పట్టణ పోలీస్టేషన్ నుండి ఊరేగింపుగా సారే తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని ప్రతిష్టించారు. ఈ వేడుకలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటల తరువాత గ్రామోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ తెలియజేసింది. వేలాదిగా భక్తుల రాకతో స్థానిక రావిచెట్టు బజారు కిక్కిరిసింది.