కృష్ణ

వైసీపీతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 7: జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. గడపగడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని చంద్రాల గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఆయా ప్రాంతాలలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం సాధ్యమవుతోందన్నారు. వైఎస్ హయాంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ప్రస్తుత తెలుగుదేశం పాలనలో ఆ పథకాలన్నింటినీ తుంగలో తొక్కి విదేశీపర్యటనలలో చంద్రబాబు మునిగిపోయారని విమర్శించారు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీలైన బాబు వస్తే జాబు, జాబు రాకుంటే నిరుద్యోగ భృతి హామీలు గాలికొదిలేశారన్నారు. పైగా నీరు-చెట్టు వంటి పథకాలతో మట్టి అమ్ముకుని కార్యకర్తల జేబులు నింపుతున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యంగా మారాయన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, మాజీ ఎంపిపి జొన్నలగడ్డ గంగాధరరావు, మాజీ సర్పంచ్ కాళేశు, పార్టీ నేతలు నాగేశ్వరరావు, రవిబాబు, వెంకటేశ్వరరావు, సుజాతరావు, చింతయ్య, సర్వయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
అలరించిన శ్రీ సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు
కూచిపూడి, ఫిబ్రవరి 7: స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కళాపీఠంపై మంగళవారం నిర్వహించిన శ్రీ సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు ఆహూతులను అలరించాయి. విజయవాడ దుర్గగుడి ఇఓ సూర్యకుమారి పర్యవేక్షణలో హైదరాబాద్‌కు చెందిన పసుమర్తి మృత్యుంజయ శర్మ, సీతాలక్ష్మి ప్రసాద్, జి భార్గవి సిద్ధేంద్ర విరచిత భామాకలాపాన్ని ప్రదర్శించారు. ముందుగా సీతాలక్ష్మీ ప్రసాద్, మృత్యుంజయ శర్మ వెంపటి రవి శంకర్ నృత్య దర్శకత్వం చేసిన వినాయక వందనాన్ని, పల్లవి గోపాలకృష్ణ అయ్యర్ విరచిత దేవిస్తుతిని, పద్మభూషణ్ డా. వెంపటి చిన సత్యం నృత్య దర్శకత్వం వహించిన జయదేవుని అష్టపదిలోని రాధికా-కృష్ణ అనే అంశాన్ని, జయ జయ దుర్గే మహిషాసుర మర్ధని అంశాన్ని, గజేంద్ర మోక్షంలోని మండుగ శబ్దాన్ని ప్రదర్శించారు. ఉదయం సిద్ధేంద్రయోగి మందిర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గగుడి ఎఇఓ అచ్యుతరామయ్య పర్యవేక్షణలో సిద్ధేంద్రయోగి విగ్రహానికి క్షీరాభిషేకం, కుంకుమార్చన, నృత్యార్చన, గ్రామోత్సవం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి అమ్మవారి శేషవస్త్రాన్ని, మహిళలకు జాకెట్ ముక్కలు ఇచ్చి నాట్యోత్సవాలకు ఆహ్వానం పలికారు.