కృష్ణ

భక్తిలో ఓలలాడించిన కూచిపూడి నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 12: నాట్య క్షేత్రం కూచిపూడిలో విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కనకదుర్గ ధర్మప్రచార పరిషత్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలలో భాగంగా 6వ రోజైన ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు భక్తిపారవశ్యాన్ని పెంపొందింప చేశాయి. ఈ సందర్భంగా గుడివాడకు చెందిన పసుమర్తి శ్రీనివాసులు శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, రాజమండ్రికి చెందిన సిద్ధేంద్ర కూచిపూడి నాట్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రదర్శించిన శ్రీ దత్తగాద ప్రేక్షకులను సమ్మోహనపర్చింది. ముందుగా పసుమర్తి శ్రీనివాసులు బృందంలోని నాట్య మయూరి యశశ్విని, యశ్వంతి, కిరణ్మయి, శివాని, హేమశ్రీలు డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ విరచిత పెద్ద వినాయకౌత్తం అనే అంశాన్ని, రామనాధపురం అయ్యంగార్ విరచిత కృష్ణుని మహిమలు అనే జావళిని, ఎస్పీ భుజంగరాయ శర్మ రచించిన రుక్మిణీ కల్యాణంలోని రుక్మిణీ ప్రవేశ దరువు, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ విరచిత కొలువైతివా రంగసాయి, త్యాగరాజ కీర్తనగా బాల కనకమయకేల, సాంప్రదాయ జతికట్టు, ఊత్‌కాడ్ వెంకట సుబ్బయ్యర్ విరచిత భక్తి కీర్తన, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి విరచిత అనఘావినగా అనే అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను సమ్మోహనపర్చారు. తదుపరి శ్రీ సిద్ధేంద్ర కూచిపూడి నాట్య కళాక్షేత్రం నిర్వహకులు పసుమర్తి శ్రీనివాస శర్మ నృత్య దర్శకత్వంలో పరమపూజ్య, అవధూత, దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజి కూచిపూడి కళాకారులకు అందచేసిన ‘శ్రీ దత్తగాద’ అనే కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను భక్తి భావంలో ఓలలాడించింది. త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి జననం నుండి భక్తులకు అనుగ్రహం కలిగించే వరకు ప్రదర్శించిన పలు అంశాలు ప్రేక్షకులను ఆనందాన్ని కలిగించాయి. దత్తాత్రేయునిగా పసుమర్తి కుమార దత్త, కార్తవ వీర్యునిగా పసుమర్తి శ్రీనివాసశర్మ, అత్రి మహర్షిగా రమేష్ కుమార్, అనసూర్యదేవిగా రెడ్డి ఉమారాణి, బాల దత్తాత్రేయుడుగా రంగశ్రావ్య, శివుడుగా హేమద్రి బదరీనాధ్, విష్ణుమూర్తిగా త్రివేణి, బ్రహ్మదేవుడుగా వడ్లమూడి గోపి, అనఘాదేవిగా ఆశ్రీత, వౌనిక, సంతోషి, తనిష్క, నిహారిక, ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు తదితరులు ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి నృత్య రూపకానికి వనె్నతెచ్చారు. కళాకారులను, నాట్యాచార్యులను నిర్వహకులు అతిథులు ద్వారా దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.