కృష్ణ

గిట్టుబాటు కాని ధరతో చెరకు సాగుపై రైతుల అనాసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 13: కృష్ణానదీ పరీవాహాక ప్రాంతమైన లంక భూముల్లో రైతులు చెరకు పంట విస్తారంగా సాగు చేస్తారు. మెట్ట, మాగాణి, లంకల్లో కలిపి ప్రతి ఏడాది సగటున 7 నుంచి 8 వేల ఎకరాల వరకు చెరకు పంట సాగవుతోంది. ఒక ఎకరం చెరకు విత్తనం నాటాలంటేనే పొలంలో దుక్కులు, విత్తన సేకరణ, రవాణా, కూలీల ఖర్చులతో కలిపి సుమారు రూ.30వేల వరకూ ఖర్చవుతోందని రైతులు అంటున్నారు. ఆ తరువాత కలుపు నివారణ, ఎరువులు, జడలు కట్టటం వంటి పనులకు మరో రూ. 15వేలు ఆవుతోంది. ఏడాది పాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెంచిన పంటను ఫ్యాక్టరీకి తరలించడం తలకుమించిన భారమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరుకుడు కూలి అధికం : చెరకు పంటను నరికి ఫ్యాక్టరీకి తరలించాలంటే ప్రధానంగా కూలీల సమస్య ఎదురవుతోంది. గతంలో తెలంగాణా జిల్లాల నుంచి చెరకు నరకడానికి వలస కూలీలు మండలంలోని వివిధ గ్రామాలకు భారీగా తరలి వచ్చేవారు. కానీ రెండు మూడేళ్లుగా పరిమిత సంఖ్యలో కూలీలు వస్తున్నా, నరుకుడు కూలీని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. టన్ను చెరకు నరికి శుభ్రం చేయాలంటే కూలీలు రూ.350 నుంచి 400 వరకు డిమాండ్ చేస్తున్నారు. గతంలోరూ. గతంలో నరుకుడు కూలీ పరిమితంగా ఉండేది, కానీ పెరిగిన ధరలతో కూలీలు కూడా అధిక కూలీ డిమాండ్ చేస్తున్నారని రైతులు అంటున్నారు. చెరకు సాగు కోసం వేలాది రూపాయలు అప్పు చేసి అనంతరం చెరకు నరికి ఫ్యాక్టరీకి తరలించాలంటే మోయలేని భారమవుతోందని రైతులు అంటున్నారు. అలాగే రవాణా ఖర్చులు కూడా టన్నుకు ఆయా గ్రామాల దూరాన్ని బట్టి రూ.650 నుంచి రూ.700 వరకు ఉంటోంది. ట్రాక్టర్ ద్వారా అయితే టన్నుకు రూ.750 నుంచి రూ.800ల వరకు ఉన్నది. దీనితో ఎకరం చెరకు(సుమారు 40టన్నులు) నరికి, రవాణా చేయాలంటే రూ.30వేల నుంచి రూ.35వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెపుతున్నారు. సాగు ఖర్చు పెరిగింది: సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో చెరకు రైతులకు కేసిపి యాజమాన్యం ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదు. అన్ని ఖర్చులు భరించి ఒక ఎకరం సాగుచేస్తే రూ.20 వేలు కూడా మిగలడం కష్టతరమవుతోందని రైతులు అంటున్నారు. కౌలు రైతుల పరిస్థితైతే మరింత దారుణంగా మారింది. కేసీపీ కర్మాగారం ఈ ఏడాది టన్ను చెరకుకు రూ.2650లు కాకుండా రూ.4000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కొంత మంది రైతు నాయకులు పోరాటం చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. సరైన మద్దతు ధర లభించక పోవడంతో చెరకు సాగు పై రైతులు కొంత విముఖత ప్రదర్శిస్తున్నారు.

మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన
జాతీయ మహిళా పార్లమెంట్
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు

మచిలీపట్నం, ఫిబ్రవరి 13: దేశంలోనే తొలిసారిగా విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పే విధంగా పార్లమెంటరీ సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సు ద్వారా దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణుల ప్రసంగాలు మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అనే కార్యక్రమాలు మహిళల ఉన్నతికి దోహదపడుతున్నాయన్నారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల విషయంలో వినూత్న విధానంలో పార్టీ ఎన్నికలను నిర్వహిస్తున్నదని, జిల్లాలో 970 పంచాయతీలు, 218 మున్సిపల్ వార్డులకు పార్టీ కమిటీలను ఎన్నుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల అధికారులు కమిటీలను కూర్పుచేసి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమంలో జిల్లాలో 250 మంది ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారన్నారు. ఎన్నికల అధికారులు కూర్పు చేసిన కమిటీలు రాష్ట్ర పార్టీ నుంచి ఐవిఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు తీసుకొని మెజార్టీ అభిప్రాయం మేరకు కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ఈనెల 9న ప్రారంభమైన కమిటీల ఎన్నికలు 28వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 65 నుంచి 75 కమిటీలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్, పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.