కృష్ణ

ఇళ్లకు మట్టి తోలుకుంటే కేసులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, ఫిబ్రవరి 13: ఇళ్ళకు మట్టి తోలుకుంటే కేసులు నమోదు చేస్తారా? ఇటుక బట్టీలకు మట్టిని అక్రమంగా తరలించినా కేసులు నమోదు చేయరా? ఇదెక్కడి న్యాయమంటూ వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, తదితర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జి.కొండూరు పోలీసుస్టేషను ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైసిపి నాయకులు మాట్లాడుతూ సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి ఇలాకాలోనే ఇంత అన్యాయం జరుగుతోందన్నారు. కుంటముక్కల గ్రామంలో పామర్తి సాంబయ్య తూర్పు చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నాడు. దీనిపై నీటిసంఘం అధ్యక్షులు సుకవాసి శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మరియు ఇరిగేషన్ ఎఇ వల్లూరు పట్ట్భారామయ్య చౌదరి ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న పామర్తి సాంబయ్యను, మరో ఇద్దరిని పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. మట్టిని తరలించేందుకు ఉపయోగించిన జెసిబిని సీజ్ చేశారు. వీరిని రాత్రంతా స్టేషన్లోనే ఉంచారని, కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వలేదని, ఉదయానే్న ఇక్కడి నుంచి మైలవరం పిఎస్‌కు తరలించారన్నారు. వీరి పట్ల అంతర్జాతీయ నేరస్థుల మాదిరిగా పోలీసులు వ్యవహరించడాన్ని జడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, వైసిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇళ్ళ మెరకల కోసం మట్టిని తోలుకుంటే ఇంత దౌర్జన్యంగా అక్రమంగా కేసులు కట్టడం అధికార టిడిపికే చెల్లిందన్నారు. ఇందంతా మంత్రి ఉమా ప్రోద్భలంతోనే జరుగుతోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా స్టేషను ఎదుట ఆందోళన చేస్తున్న సమయంలో గ్రావెల్ రవాణా చేస్తూ అటువైపుగా వెళ్తున్న దిలీప్ బుల్డ్ కాన్‌కు చెందిన నాలుగు భారీ టిప్పర్లను వైసిపి నాయకులు అడ్డగించి పోలీసులకు అప్పగించారు. గ్రంథివాని చెరువునుంచి సరైన అనుమతులు లేకుండా వీరు కూడా అక్రమంగా విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారని ఆరోపించారు. అయితే దీనికి అనుమతి ఉందని అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ ఎఇ తేల్చి చెప్పారు. దీనిపై జడ్పీటిసి బ్రహ్మయ్య మాట్లాడుతూ సరైన బౌండరీలు నిర్ణయించకుండా ఎలా అనుమతి ఇచ్చారని, మైనింగ్ బిల్లులు కూడా లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారని, వాటిపై కూడా క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అదుపులోనికి తీసుకున్న వారికి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇటుక బట్టీల నిర్వాహకుల వద్ద టన్నులకొద్దీ మట్టి అక్రమ నిల్వలు ఉన్నాయన్నారు. వెల్లటూరు, కుంటముక్కలలోని చెరువుల నుంచే ఆమట్టిని అక్రమంగా తరలించి నిల్వ చేశారన్నారు. ఇదంతా బహిరంగ రహస్యమేనన్నారు. అయినా పోలీసులు వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎంపిపి తిరుపతిరావు, వైసిపి నాయకులు మందా జక్రి, చెన్నూరు సుబ్బారావు, పసుపులేటి రమేష్ కుంటముక్కల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా మండల పరిధిలోని కుంటముక్కలలో వైసీపీ నేతల అక్రమ మట్టి తోలకాన్ని సమర్థించటం గురివిందలు గోల చేస్తున్నట్లుగా ఉందని వైసీపీ నేత జోగి రమేష్‌పై తెలుగుదేశం నేతలు విమర్శించారు. జి కొండూరులో సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో టిడిపి నేతలు ధనేకుల సాంబశివరావు, మంగలంపాటి వెంకటేశ్వరరావు, ఉయ్యూరు నరశింహారావు, సుఖవాశి శ్రీహరి, లంకా రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి చిన్న సంఘటనకు మంత్రిని ఉమానే బాధ్యుడిని చేయటం, తద్వారా వైసీపీ అధినేత జగన్ వద్ద మార్కులు వేయించుకునేందుకు జోగి రమేష్ పాట్లు పడుతున్నాడన్నారు.