కృష్ణ

రెండేళ్ళలో మారనున్న గుడివాడ ముఖచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఫిబ్రవరి 16: వచ్చే రెండేళ్ళలో గుడివాడ ముఖచిత్రం మారనుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం హౌసింగ్ ఫర్ ఆల్‌లో భాగంగా జిప్లస్-5 నిర్మాణాలను చేపట్టే టిట్‌కో సంస్థ బృందం పట్టణంలో పర్యటించింది. నిర్మాణాలకు కేటాయించిన 70ఎకరాల స్థలంలో సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను పర్యవేక్షించిన చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ పట్టణంలో ప్రస్తుతం 3,312మంది లబ్ధిదారులను ఇళ్ళనిర్మాణాలకు ఎంపిక చేశారన్నారు. మరో 4,500మందికి ఇళ్ళస్థలాలను కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టిపివో శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన కూచిపూడి నృత్యాంశాలు
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 16: స్థానిక హిందూ కళాశాలలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ ఆర్చరీ పోటీల్లో భాగంగా రెండవ రోజైన గురువారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కూచిపూడి శ్రీ సిద్ధేంద్రయోగి కళాపీఠం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను గావించాయి. పలు రాష్ట్రాల నుండి తరలివచ్చిన క్రీడాకారులు కూడా తమ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

కాంపౌండ్‌లో నవీన్‌కు ద్వితీయ ర్యాంకు

మచిలీపట్నం, ఫిబ్రవరి 16: కృష్ణావిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హిందూ కళాశాల మైదానంలో జరుగుతున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో కృష్ణా విశ్వవిద్యాలయం ఆర్చర్లు ముందంజలో దూసుకుపోతున్నారు. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సర్వేష్ పరిక్ (మణిపాల్ యూనివర్శిటీ) నవీన్‌కుమార్ (కృష్ణా యూనివర్శిటీ), లవ్‌జోత్ సింగ్ (పంజాబీ యూనివర్శిటీ) వరుసగా మొదటి మూడు ర్యాంకులను కైవశం చేసుకోగా ఇండియన్ రౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో అజిత్‌బాబు (యూనివర్శిటీ ఆఫ్ కాలికట్), అనీస్ యాదవ్ (వీర్‌బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ), సుతార్ ధనుంజయ్ (సావిత్రీభాయ్ పూలే పూణే యూనివర్శిటీ) లు ప్రధమ, ద్వితియ, తృతియ ర్యాంకులను దక్కించుకొన్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో రీతికా సింగ్ (చరణ్‌సింగ్ యూనివర్శిటీ), సందీప్‌కౌర్ (గురునానక్ దేవ్ యూనివర్శిటీ), కె పుష్టాబటిదేవి (మణిపూర్ యూనివర్శిటీ), మొదటి మూడు ర్యాంకులను సాధించారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్‌జాదవ్ (సంత్‌గడ్జ్‌బాబా అమరావతి యూనివర్శిటీ), ఇంద్రచాంద్ స్వామి (గురునానక్‌దేవ్ యూనివర్శిటీ), అంకూర్ (మహర్షీ దయానంద్ యూనివర్శిటీ), మహిళల విభాగంలో ప్రాచీసింగ్ (ఎంఎస్‌బి యూనివర్శిటీ), ప్రియాంక (యూనివర్శిటీ ఆఫ్ డిల్లీ) , వౌనికా (యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా) లు ప్రధమ, ద్వితియ, తృతియ ర్యాంకులను కైవశం చేసుకొని శుక్రవారం ఒలంపిక్ రౌండ్‌లో తలపడనున్నారు.