కృష్ణ

ఎలక్రానిక్స్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఫిబ్రవరి 17: కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని ఒక ఎలక్రానిక్స్ షాపు గోడౌన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.70లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. స్థానిక భాస్కర్ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్ షాపునకు చెందిన గోడౌన్‌లో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సందులోగల భవంతిలో రెండవ అంతస్తులో భాస్కర్ ఎలక్ట్రానిక్స్ షాపు గోడౌన్ ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్ కారణంగా గోడౌన్‌లో ఉన్న ఎసి మి షన్‌లు, ఫ్రిజ్‌లు, టివి తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కాలి బూడిద అయ్యా యి. రెండు రోజుల కిందటే సుమారు రూ.60లక్షల విలువైన వస్తువులు వచ్చినట్లు షాపు యజమాని కొప్పు నరేంద్ర తెలిపారు. వార్డు కౌన్సిలర్లు యేచూరి రాము, శాఖమూరు స్వర్ణలత వంశీధర్, సరికొండ రవీంద్రబాబు, ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ తదితరులు వాటర్ ట్యాంక్‌ల ద్వారా తొలుత మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వి శ్రీనివాసరెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకొని నందిగామ, జగ్గయ్యపేట ఫైర్ ఇంజన్‌లతో సుమారు 5గంటల పాటు కష్టపడి మంటలను పూర్తి స్థాయిలో అదుపుచేశారు. గోడౌన్‌లోని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు తలుపులు, దర్వాజాలు, కిటికీలు సైతం పూర్తిగా అగ్నికి అహుతి అయ్యాయి. మంటల వేడికి భవనం గోడలు, స్లాబ్ నెర్రెలిచ్చింది. ఘటనా స్థలాన్ని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తదితర ప్రముఖులు సందర్శించి షాపు యజమానిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విన్నకోటలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం
* 54 మేకలు సజీవ దహనం * 6లక్షల మేర ఆస్తి నష్టం
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 17: మండల పరిధిలోని విన్నకోట గ్రామంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో సుమారు రూ.3లక్షలు విలువ చేసే 54 మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ సంఘటనలో మరో 3లక్షల విలువైన ఆస్తి కూడా బుగ్గిపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దళితవాడకు చెందిన మద్దాల నాగేశ్వరమ్మ, ఆమె కొడుకు వెంకటేశ్వరరావు గత కొంత కాలంగా మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం యథావిధిగా మేకలను చావిడిలో కట్టివేశారు. రాత్రి 10.30గంటల సమయంలో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణకాలంలో కళ్ల ముందే పెంచి పోషించిన మూగ జీవాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను అర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కళ్ల ముందు బుగ్గిపాలైన మేకలను చూసి బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఐదు కాసుల బంగారం, రూ.50వేల నగదు, గృహోపకరణాలు, విలువైన పత్రాలు బుగ్గిపాలయ్యాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పశు సంవర్ధక శాఖాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధితులను అడిగి నష్టం వివరాలు సేకరించారు. గ్రామ మాజీ సర్పంచ్ శాయన రవి కుమార్ బాధితులకు రూ.2వేల నగదు, 25కిలోల బియ్యాన్ని అందచేశారు. ది ఫెయిత్ వర్షిప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు లింగం జాన్ బెన్నీ బాధితులకు 75కిలోల బియ్యాన్ని అందచేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సురేందర్, గ్రామ కార్యదర్శి కుటుంబరావు నష్టాన్ని అంచనా వేశారు.

వైభవంగా కనకదుర్గ అమ్మవారి సంబరాలు
కూచిపూడి, ఫిబ్రవరి 17: స్థానిక శ్రీ దుర్గానగర్ దళితవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారి సంబరాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. గ్రామ కమిటీ పర్యవేక్షణలో పసుమర్తి రామకృష్ణ అర్చకత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి మొక్కుబడులు తీర్చుకుని పొంగళ్లు సమర్పించుకున్నారు. అనంతరం అన్నసమారాధన జరిగింది. శ్రీ కనకదుర్గ నాట్య మండలి, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యువగర్జన నాటకాన్ని ప్రదర్శించారు.

తగ్గిన దిగుబడులతో
మినుము రైతులు దిగాలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 17: జిల్లాలో మినుముల దిగుబడులు షాకిస్తున్నాయి. మినుము పంటకు వైరస్ తెగుళ్లు విజృంభించటంతో ఈ పరిస్థితి నెలకొందని రైతు లు పేర్కొంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. గత ఏడాది ఎకరాకు ఏడు నుండి తొమ్మిది క్విటాళ్ల వరకు దిగుబడి వచ్చిన మినుము చేలు ప్రస్తుతం నాలుగు క్వింటాళ్లకే పరిమి తం కావటంతో రైతన్నలు విస్తుపోతున్నారు. దీనికి తోడు మినుముల ధర లు కూడా తక్కువగా ఉండటంతో పె ట్టుబడి కూడా రాదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది మినుముల ది గుబడులు గణనీయంగా తగ్గే అవకా శం ఉందనడంలో సందేహం లేదు. ః

ఇస్రో శాస్తవ్రేత్తలకు అభినందన ర్యాలీ
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 17: 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి ప్రపంచంలో భారత కీర్తిప్రతిష్టలను రెపరెపలాడించిన ఇస్రోకి అభినందనలు తెలుపుతూ శుక్రవారం తోట్లవల్లూరు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థులతో కలిసి ప్రధాన రహదారి వెంట సెంటర్ వరకు ర్యాలీ జరిపారు. తహశీల్దార్ జి భద్రు, లయన్స్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, అధ్యక్షుడు చక్కా ఉదయభాస్కర్, విఆర్‌ఓ డి నాగేశ్వరరావు, పిఈటి మణి, ఉపాధ్యాయిని స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే తోట్లవల్లూరు లయన్స్‌క్లబ్ నిత్యాన్నదానికి శుక్రవారం రొయ్యూరుకు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మోర్ల రామచంద్రరావు రూ.5వేల విరాళాన్ని క్లబ్ అధ్యక్షుడు చక్కా ఉదయభాస్కర్‌కు అందజేశారు.