కృష్ణ

భక్తులతో పులకించిన ఐలూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 24: లక్షలాది భక్తుల శరణ ఘోషతో పుణ్యక్షేత్రమైన ఐలూరు పులకించింది. దక్షిణకాశీగా పేరుగాంచిన మండలంలోని ఐలూరులో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు తిరిగి వస్తూ ఐలూరులో శివలింగాన్ని ప్రతిష్ఠింప జేశాడని చెబుతారు. శివరాత్రి రోజు ఐలూరు వద్ద కృష్ణానదిలో స్నానమాచరించి శివుని దర్శించుకున్న వారికి కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసినంత ఫలం లభిస్తుందని స్థలపురాణం చెబుతోంది. ఈ విశిష్టతో జిల్లాలో పలు ప్రాంతాల నుంచి భక్తులు ఐలూరు తరలి వచ్చారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్లు స్నానాలను భక్తులు ఉపయోగించుకున్నారు. కొంతమంది భక్తులు బోయలదిబ్బ పాయకు వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. స్నానంమాచరించి అనంతరం పితృదేవతలకు పిండప్రదానం చేశారు. ముత్తయిదువలు ఒకరినొకరు వాయినాలు పుచ్చుకున్నారు. కృష్ణానదిలో గంగిరెద్దుల కోలాహలం, ఆశీర్వచనాలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. ముందుగా శ్రీరామేశ్వరస్వామి ఆలయంలో శివుడిని, తర్వాత ప్రక్కనే ఉన్న రఘునాయకస్వామి ఆలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జయశ్రీ ప్రసాదాలు అందజేశారు. ఉయ్యూరు సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తోట్లవల్లూరు ఎస్‌ఐ ప్రసాద్ సిబ్బంది సహాకారంతో భారీ బందోబస్తీ ఏర్పాటు చేశారు. తహశీల్దార్ జి భద్రు, సర్పంచ్ పి రాఘవులు, ఆర్‌ఐ సునీత తదితరులు భక్తులకు అసౌకర్యం కల్గకుండా పర్యవేక్షించారు.

శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి
తమ్మిలేరులో మునిగి విద్యార్థి మృతి
ముసునూరు, ఫిబ్రవరి 24: బలివే ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. తమ్మిలేరులో స్నానానికి దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు నీటిలో మునిగి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బేనర్జీపేటకు చెందిన మద్దెల నాగలక్ష్మి కుమారుడు కౌశిక్ (13) స్థానిక బాలగంగాధర్ తిలక్ మున్సిపల్ హైస్కూల్‌లో8వ తరగతి చదువుతున్నాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం కౌశిక్, మిత్రులైన చంద్రశేఖర్, ఎం దుర్గారావు, ఆది సైకిల్‌పై ఏలూరు నుండి బయలుదేరారు. పేదవేగిమండలం విజయరాయిలో సైకిళ్ళను పెట్టి సాన్నాలు చేసి శ్రీరామలింగేశ్వరుని దర్శించుకునేందుకు తమ్మిలేరులో దిగారు. నీరు వచ్చేందుకు జెసిబితో ఏర్పాటు చేసిన గోతిలో ఈ నలుగురు స్నేహితులు దిగగా కౌశిక్ ఆ గోతిలో ఉన్న బురదలో కూరుకుపోయాడు. ఎంత సేపటికీ కౌశిక్ పైకి రాపోయేసరికి మిగిలిన ముగ్గురు స్నేహితులు ఆగోతిలో దిగి కౌశిక్‌కోసం గాలించారు. పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి కౌశిక్‌ను బయటకు తీసి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి చేర్చారు. అప్పటికే కౌశిక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.