కృష్ణ

లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 3: కార్పొరేషన్ రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి రుణాల మంజూరుపై శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో అధికారులు, బ్యాంకర్లతో మంత్రి రవీంద్ర సమీక్ష నిర్వహించారు. 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించి మంజూరైన యూనిట్లు, బ్యాంక్ రుణాలు, సబ్సిడీ విడుదల తదితర అంశాలపై కార్పొరేషన్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కార్పొరేషన్ రుణాల మంజూరులో ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు. అనుమతి కోసం బ్యాంకులకు వచ్చే లబ్ధిదారుల పట్ల బ్యాంకర్లు అగౌరవంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విల్లింగ్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ లబ్ధిదారులను వెనక్కి పంపుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. రుణాలు మంజూరు చేయాలంటే డిపాజిట్లు చేయాలని, నో డ్యూ సర్ట్ఫికెట్లు అడుగుతున్న విషయం కూడా తెలిసిందన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు గారే ప్రమాదం ఉందన్నారు. దీనిపై స్పందించిన జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి రుణాల మంజూరులో నిబంధనలను బ్యాంక్ మేనేజర్లకు వివరించారు. రుణం మంజూరుకై బ్యాంక్‌కు వచ్చిన లబ్ధిదారులు నో డ్యూ సర్ట్ఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా గత ఏడాది రాష్ట్రంలో రూ.800కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. బందరు నియోజకవర్గంలో గత ఏడాది 324 యూనిట్లు మంజూరు కాగా చాలా వరకు యూనిట్లు గ్రౌండ్ కావల్సి ఉందన్నారు. ఈ ఏడాది రూ.38కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు 900, అర్బన్ ప్రాంతాలకు 705 యూనిట్లు మంజూరు చేశామన్నారు. మార్చి నెలాఖరు లోపు లక్ష్యాన్ని సాధించాలన్నారు. గత ఏడాది ఎస్సీ, బిసి కార్పొరేషన్‌ల ద్వారా మంజూరై గ్రౌండింగ్ కాని యూనిట్లకు ప్రత్యేక రుణ మేళా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్పొరేషన్ రుణాల మంజూరు లక్ష్యాన్ని రెండు నెలల్లో సాధించాలన్నారు. పాడి గేదెలు, గొర్రెలకు సంబంధించి పట్టణాల్లో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని మున్సిపల్ అధికారులు మంత్రి రవీంద్ర దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్పందించిన లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాడి గేదెల రుణాల మంజూరు చేయాలంటే పశువుల పోషణకు తగిన స్థలం ఉండాలని, పచ్చిమేత దొరికే విధంగా ఉంటే రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, బిసి కార్పొరేషన్ ఇడి పెంతోజీరావు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఎంపిడివో జివి సూర్యనారాయణ, ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ సీతారామ్, వివిధ బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.

‘దుల్హన్’ను సద్వినియోగం చేసుకోండి
* జలవనరుల మంత్రి దేవినేని ఉమ
మైలవరం, మార్చి 3: ఎపి దుల్హన్ పథకాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎపి దుల్హన్ పథకం కింద ముస్లిం మహిళలకు ఒక్కొక్కరికీ 50వేల రూపాయల చొప్పున మంజూరయ్యాయి. మంజూరు పత్రాలను శుక్రవారం జలవనరుల శాఖ కార్యాలయంలో ఏడుగురు లబ్ధిదారులకు మంత్రి ఉమ అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం మహిళల అభ్యున్నతికై దుల్హన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈపథకం కింద పేద ముస్లిం మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన పఠాన్ సలీమా సుల్తానా, హసీనా ఖాతుర్, దిల్షాన్ బేగం, రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామానికి చెందిన షేక్ షకీలా, జి కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన షేక్ నాగూర్ గౌసియా, మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ చాన్‌బీ, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన షేక్ హసీనాలకు మంత్రి ఉమ పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలను అందించారు. రెండు రోజుల్లో ఈ పథకం కింద లబ్ధిదారులకు వారి వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ అవుతుందని మంత్రి వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.