కృష్ణ

నూతన విధానంతో కార్మికుల హక్కులకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: సిఆర్‌డిఏ పరిధిలో ఉద్యోగ, కార్మికుల హక్కులను హరించే విధంగా రూపొందించిన మానవ వనరుల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నియంతృత్వ దిష్టిబొమ్మను దగ్ధ కార్యక్రమం జరిగింది. స్థానిక బీసెంట్‌రోడ్డులోని అన్సారీపార్కు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ నూతన విధానం వలన కార్మికులు తమ హక్కులను కోల్పోతారని తెలిపారు. కార్మికుల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పే చంద్రబాబు కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టారని విమర్శించారు. కార్మికులకు అన్యాయం జరిగితే అడిగే హక్కు లేకుండా చేయడానికే ఈ విధానాలు ఉన్నాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ విధానాలు చేపట్టడం దారుణమన్నారు. ఉద్యోగ, కార్మికుల విషయంలో రిజర్వేషన్లు వర్తింపజేయకపోవడం సామాజిక న్యాయానికి తూట్లు పొడవడమే అవుతుందన్నారు. మరో పక్క చంద్రబాబు దళితులు తన బిడ్డల్లాంటి వారని వారికి రిజర్వేషన్లు ద్వారా వచ్చే ఉద్యోగాలకు తూట్లు పొడవడం అంటే దళితులు పల్ల బాబకు ఉన్న సవతితల్లి ప్రేమ అర్థమవుతుందన్నారు. ఈ విధానాలు మారుకోవాలని రిజర్వేషన్లు పాటించాలని, కార్మికుల హక్కులకు నష్టం కలిగించే హెచ్‌ఆర్ పాలసీ విధానాలు మానుకోవాలని ఆయన కోరారు. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కోసమని చెప్పి నిర్మిస్తున్న రాజధాని కార్యకలాపాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు పాటించకపోవడం దారుణమన్నారు. కొత్త విధానాలు, కోడ్‌ల పేరుతో కార్మికుల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వం లాభం పొందాలని చూస్తోందన్నారు. కానీ ఈ విధానాలకు రాబోయే రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి యువి రామరాజు, జి నటరాజ, కె శ్రీదేవి, ఎన్ ప్రసాద్, నగర కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసుల్లో ముగ్గురు పాత నేరస్తుల అరెస్టు
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ చోట్ల షాపుల షట్టర్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే ముగ్గురు పాత నేరస్తులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షన్నర వి లువ చేసే నగలు, సామగ్రి, నగదు స్వా ధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్త రాజరాజేశ్వరీపేటకు చెందిన మింగి నరసింహారావు అలియాస్ కంఠం (29) పాత నేరస్తుడు. వివిధ షాపుల్లో చోరీలకు పాల్పడిన కేసుల్లో నిందితుడు. ఇతనిపై గతంలో ఇబ్రహీంపట్నం, గన్నవరం, సత్యనారాయణపురంతోపాటు కృష్ణాజిల్లా గుడివాడ, నూజివీడు పోలీస్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. రాత్రివేళల్లో నగరంలో సం చరిస్తూ షాపుల షట్టర్ తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతూ ఉంటా డు. ఇందుకు సంబంధించి మాచవ రం, సూర్యారావుపేట పోలీస్టేషన్లలో ఇ టీవల కేసులు నమోదయ్యాయి. ఇటీవ ల కాలంలో ఉయ్యూరు టౌన్ పోలీస్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదైంది.
అదేవిధంగా గన్నవరానికి చెందిన కాటూరి నాగేశ్వరరావు అలియాస్ చంటి (45), ఏలూరుకు చెందిన లకనవరపు ఖాళీవరప్రసాద్ (26)లు సహ నేరస్తులు. వీరిద్దరిపై గతంలో గన్నవ రం, గవర్నర్‌పేట, సత్యనారాయణపు రం, మాచవరం, పటమట, కృష్ణలంక పోలీస్టేషన్లలతోపాటు పశ్చిమ గోదావ రి జిల్లా ఏలూరు పోలీస్టేషన్‌లో కేసు లు నమోదయ్యాయి. వీరు కూడా షా పుల షట్టర్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతూ వస్తున్నారు. ఆయా కేసుల్లో వీరిద్దరూ జైలుకు కూడా వెళ్లారు. బయటకు వచ్చాక కూడా తిరి గి నేరాలకు పాల్పడుతున్న క్రమంలో గన్నవరం పోలీస్టేషన్ పరిధిలో ఓ షాపు షట్టర్ తాళం పగులగొట్టి రాగి వైరు చోరీ చేశారు. ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు వీరి నుంచి సుమారు లక్షన్నర విలువైన నగలు, ఎలక్ట్రికల్ సా మగ్రి, నగదు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో కామత్ హోటల్ బ్రాంచీలు ప్రారంభం
పటమట, ఏప్రిల్ 17: నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నగర ప్రజలకు ‘కామత్’ హోటల్స్ ద్వారా రుచికరమైన వంటకాలను అందించేందుకు ఒకేసారి ఆటోనగర్, పటమట ఎన్‌టిఆర్ సర్కిల్, పివిపి మాల్ రోడ్డు, గాంధీనగర్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం ఆటోనగర్‌లోని కామత్ హోటల్ సెంట్రల్ కిచెన్‌ను మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ప్రజలకు రుచికరమైన, సరసమైన ధరలకు అందించాలని సూచించారు. నగరంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల కోసం ఒకేసారి వంటలను తయారు చేసి, వెంటనే అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ వంటలశాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని ప్రకటించారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి కామత్ హోటల్స్ అధినేత సింగరాజు సుబ్బరాజు (కామత్ రాజు) మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానికి వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని నాలుగు ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా 4కామత్ హోటల్ బ్రాంచీలు నూతనంగాప్రారంభించామని తెలిపారు. తాము శాఖహార, మాంసాహార వంటకాలను గడిచిన కొన్ని దశాబ్ధాలుగా భోజన ప్రియులకు అందిస్తున్నామన్నారు. పలు రకాల చికెన్, మటన్, రొయ్యల బిర్యానీలను అందించటంతోపాటు, ఎగ్, వెజ్ బిర్యానీలను, క్వాలిటీ, క్వాంటిటీతో తక్కువ ధరలకు సామా న్య మానవులకు కూడా అందుబాటులో ఉంచామన్నారు. డోర్ డెలివరీ సౌకర్యం కల్పించామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా శంకర్‌పూలజీ ఉప మహంత్ (శ్రీ కాశీ అన్నపూర్ణ దేవస్థానం) గూడూరు రతన్ బాబాజీలు హాజరై దీవెనలు అందించటం తమ భాగ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బొండ ఉమామహేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యనారాయణ మూర్తి, సుగుణమ్మ, ఎమ్మె ల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ ఐలా పురం వెంకయ్య, విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు.