కృష్ణ

హైవేలపై ఇక మొబైల్ మద్యం షాపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, మార్చి 20: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు జాతీయ రహదారుల పక్కన 500 మీటర్లలోపు మద్యం విక్రయ దుకాణాలు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులననుసరించి అబ్కారీ శాఖ అందుకు అమలుగా సదరు షాపులకు ఆదేశాలు జారీచేసింది. కాని అబ్కారీ వారికి అమ్మకాలు కావాలి, ప్రభుత్వానికి నిధులు కల్పించాలి అనే ఆలోచనతో ఆ శాఖాధికారులే దొడ్డిదారిన రోడ్ల పక్కన హోటళ్లలో కిళ్లీ షాపుల్లో సేల్స్ పాయింట్స్ పెట్టుకోండి, పట్టుకుని కేసులు రాసేది మేమే కదా! కేసులు లేకుండా చూస్తాం అమ్మకాలు పెంచితే సరి అని సలహాలు, సూచనలు ఇచ్చేశారని తెలిసింది. ఈ మేరకు జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ఎన్‌హెచ్ రోడ్ల పక్కన సుమారు 300 మద్యం దుకాణాల వరకు స్థాన చలనం చెందనున్నాయని సమాచారం. ఉదాహరణకు పామర్రు ప్రాంతంలో ఉన్న ఆరు దుకాణాలు పంట పొలాల మధ్య డొంక రోడ్లలో నెలకొల్పే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే డొంకల్లో ఏర్పాటుచేసే దుకాణాలను స్టాకు పాయింట్లుగా ఉంచుకుని ఎంచక్కా బెల్ట్ షాపుల స్థానంలో సేల్స్ పాయింట్స్ పెట్టుకుని అమ్మకాలు జరిపే చర్యలు యజమానులు చకచకా జరిపేస్తున్నారు. అవసరమైతే ఆటోలో మద్యం సీసాలు పెట్టుకుని కొన్ని ప్రాంతాల్లో నిలుపుదల చేసి మొబైల్ లైన్ షాపీలను తెరుస్తామని ఓ షాపు యజమాని తెలిపాడు. ఏది ఏమైనా ఒకపక్క దూరంగా ఉండే షాపులకు రాలేని మందు బాబులకు మరో పక్క రాష్ట్ర ఖజానా నిధి సమకూర్చేందుకు షాపు యజమానులు తమ అధిక ధరల విక్రయంతో సేవలందిస్తున్నారని భావించక తప్పదంటున్నారు ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు.

ఘనంగా ముగిసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

మైలవరం, మార్చి 20: ఎల్బీఆర్సీఇ ఎన్‌ఎస్‌ఎస్ టీం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మండలంలోని పొందుగలలో జరుగుతున్న స్పెషల్ క్యాంపు సోమవారంతో ఘనంగా ముగిసింది. ముగింపు రోజున వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికీ తిరిగి మూడు కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటిలో మరుగుదొడ్డి లేని వారిని గుర్తించటం, నిరక్ష్యరాస్యతపై సర్వే నిర్వహించి నిరక్షరాస్యులకు సంతకం నేర్పించడం, ఎంపియుపి స్కూల్‌లో విద్యార్థులకు ఆటల పోటీలను, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం చేశారు. పిల్లలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈసందర్భంగా డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఇతరులకు సాయం అందించటం వల్ల వచ్చే ఆనందం వెలకట్టలేనిదన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి పి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో పలు అంశాలపై చైతన్యం తెచ్చేందుకు తమ వాలంటీర్లు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటారన్నారు. వాలంటీర్లు పలువురు మాట్లాడుతూ గత వారం రోజులుగా తాము గ్రామాలలో ప్రజలతో మమేకమై వారు పడుతున్న ఇబ్బందులు, వారి జీవన విధానం చూశామని, అందుకే వారికి వీలైన విధంగా సేవ చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇన్‌ఫ్రా డైరెక్టర్ కె తిమ్మారెడ్డి, సర్పంచ్ బి రాజారావు తదితరులు పాల్గొని ఎన్‌ఎస్‌ఎస్ టీంను వారి సేవలను అభినందించారు.

ఆసక్తికరంగా మారిన 20వ వార్డు ఉపఎన్నిక
* టిడిపి అభ్యర్థిగా దివంగత చైర్మన్ కుమారుడు రాజా
* నేడు తుది నిర్ణయానికి రానున్న కాంగ్రెస్, వైసిపి
పెడన, మార్చి 20: స్థానిక 20వ వార్డు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దివంగత చైర్మన్ యర్రా శేషగిరిరావు మరణంతో ఈ వార్డుకు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9వతేదీన ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సదరు నోటిఫికేషన్‌ను సోమవారం మున్సిపల్ కమిషనర్ మనె్నం గోపాలరావు పురపాలక సంఘ కార్యాలయ నోటీసు బోర్డులో పొందుపర్చారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత చైర్మన్ శేషగిరిరావు కుమారుడు రాజాను ఆ పార్టీ ఖరారు చేసింది. రాజా ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరుతూ టిడిపి నాయకులు పలు రాజకీయ పార్టీల నాయకులను కలిసి అభ్యర్థించారు. ఈ విషయమై కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థిని నిలబెట్టాలా..? ఏకగ్రీవం చేయాలా..? అనే అంశంపై చర్చించుకున్నారు. డిసిసి అధ్యక్షుడు ధనేకుల మురళీ మోసనరావు అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు సమావేశమై ఎన్నిక ఏకగ్రీవానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పిసిసి దృష్టిలో పెట్టుకుని తుది ప్రకటన చేస్తామని ధనేకుల తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. అయితే గతంలో వైసిపి నాయకులు శేషగిరిరావు కుటుంబం నుండి అభ్యర్థిని నిలబడితే ఏకగ్రీవానికి సహకరిస్తామని, బయట వ్యక్తులను పోటీకి దింపితే తాము కూడా పోటీకి వస్తామని చెప్పారు.