కృష్ణ

రాజధాని భవనాల డిజైన్లపై సలహాలు, సూచనలివ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో 900 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయ ప్రాధమిక డిజైన్లపై సామాజిక మాధ్యమాల ద్వారా సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్తు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. లండన్‌కు చెందిన నార్మన్ ఫాస్టర్ ప్లస్ పార్టనర్స్ ప్రతినిధులు సిఎం చంద్రబాబు నాయుడు కు అందించిన ప్రభుత్వ నగరానికి సంబంధించి స్ధూల వ్యూహ ప్రణాళికపై అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి గాను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో అప్‌లోడ్ చేయడం జరిగిందన్నారు. సామాజిక మాధ్యమాలతోపాటు ఎపిసిఆర్‌డిఎ వెబ్‌సైట్‌లోనూ ఆప్‌లోడ్ చేసినట్టు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన స్పందనను అభిప్రాయాలను, సూచనలను సిఎం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తామని తెలిపారు. అమరావతి ప్రజా రాజధాని బిల్డింగ్ సస్టెయినబుల్ విజన్ పేరుతో లండన్‌కు చెందిన నార్మన్ ఫాస్టర్ ప్లస్ పార్టనర్స్ రూపొందించిన డిజైన్లను పరిశీలించి వాటిపై వ్యాఖ్యలు, సలహాలు, అభిప్రాయాలు తెలపాలని ఆయన కోరారు. ఈప్రక్రియ ద్వారా ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములవ్వాలని తెలిపారు.