కృష్ణ

ఈ లారీకి త్వరలో ‘సిల్వర్ జూబ్లీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మార్చి 23: తోట్లవల్లూరు బస్టాండ్ సెంటర్లో సుమారు 24 సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్‌కి చెందిన లారీ తుప్పుపట్టి మట్టిలో కలిసిపోతోంది. గతంలో ఏన్‌టిఆర్ సిఎంగా ఉన్నప్పుడు మద్యనిషేదం విధించారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మండలంలోని పెనమకూరులోని కోళ్లఫారాలకు మందులను లారీలో తీసుకువచ్చారు. ఈ మందులతో పాటే మద్యం బాటిళ్లను డ్రైవర్ తీసుకు వచ్చారు. పోలీసులు మద్యం ఉన్నట్టు గుర్తించి లారీని పట్టుకుని సీజ్‌చేశారు. అప్పటి నుంచి ఈ లారీ బస్టాండ్ సెంటర్లోనే ఉంటోంది. త్వరలో సిల్వర్ జూబ్లీ చేసుకోబోతోందని స్థానికులు జోకులేసుకుంటున్నారు. లారీని కోర్టుకి పెట్టినా సంబంధిత యజమాని ఇంత వరకు రాలేదని ఎస్‌ఐ ప్రసాద్ చెపుతున్నారు. ఈ లారీ దాదాపు తుప్పు పట్టిపోయింది. లారీ బాడిలో నుంచి చెట్లు మొలిచాయి. లారీ చుట్టూ పెద్దఎత్తున అపరిశుభ్రత నెలకొంటోందని, దీనిని తొలగించాలని గ్రామస్థులు అనేకసార్లు పోలీసులను కోరారు. కాని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో లారీని వేలం వేస్తామని పోలీస్ అధికారులు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

దేశం కోసం చిరునవ్వుతో ప్రాణాలు అర్పించిన త్యాగశీలి ‘్భగత్‌సింగ్’ - మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 23: స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం చిరు నవ్వుతో అర్పించిన త్యాగశీలి భగత్ సింగ్ అని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కొనియాడారు. భగత్ సింగ్ 87వ వర్ధంతిని గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో స్థానిక చైతన్య కళాశాలలో భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించగా మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ పాల్గొని భగత్ సింగ్ ధైర్యసాహసాలు, త్యాగనిరతిని కొనియాడారు. వలసవాదాన్ని వ్యతిరేకించి, విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసిందన్నారు. అటువంటి మహనీయుని త్యాగం చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మహేష్, కీర్తి, ప్రిన్సిపాల్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

19వ వార్డు ఉప ఎన్నికకు ఆరు నామినేషన్లు
టిడిపికి కాంగ్రెస్, రెబల్స్ భయం
గుడివాడ, మార్చి 19: స్థానిక 19వ వార్డు ఉప ఎన్నికకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు గురువారం టిడిపి అభ్యర్థిగా నండూరి వీరవెంకట ప్రసాద్, రెబల్ అభ్యర్థిగా పరసా నరేష్‌మోహన్, కాంగ్రెస్ అభ్యర్థిగా కూరేటి శ్యామ్, టిడిపి డమీ అభ్యర్థిగా పంచుమర్తి శ్రీనివాసరావు, బుధవారం వైసీపి అభ్యర్థి గణపతి సూర్యనారాయణ రెండు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ వార్డు వైసీపి అభ్యర్థి సీనియర్ నేత గణపతి లక్ష్మణరావు ఇటీవల ఆయన మరణించడంతో వార్డు ఉప ఎన్నిక అనివార్యమైంది. గణపతి కుటుంబ సభ్యులు ఉప ఎన్నికల్లో పోటీ పెట్టవద్దంటూ టిడిపిని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎన్నికకు రంగం సిద్ధమైంది. గతంలో వైసీపి అభ్యర్ధి లక్ష్మణరావుపై ఓటమి పాలైన టిడిపి అభ్యర్ధి పరసా నరేష్‌మోహన్‌కు ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడంతో ఆయన రెబల్ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఈ వార్డుల్లో వైసీపి అభ్యర్థికి కేవలం 20ఓట్ల మెజార్టీ మాత్రమే రావడాన్ని బట్టి టిడిపి అభ్యర్థిగా ఉన్న పరసా బలాన్ని అంచనా వేయవచ్చు. అయితే టిడిపి అభ్యర్థిత్వాన్ని ఈసారి నండూరికి ఇవ్వడంతో పరసా ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు. దీంతో టిడిపి శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఇదిలావుండగా వార్డు ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడంతో టిడిపికి బుద్ధి చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలిపింది. వైసీపి, టిడిపి రెబల్, కాంగ్రెస్ అభ్యర్ధులంతా టిడిపి ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధాన వైసీపి, టిడిపిలు విజయంపై ధీమాతో ఉన్నాయి. రెబల్ అభ్యర్ధి వల్ల టిడిపి విజయావకాశాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వార్డు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

యువత క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలి
* చైర్మన్ బాబా ప్రసాద్
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 23: యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు పోటీలు దోహదం చేస్తాయని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని విషయాల్లోనూ పోటీతత్వం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, నోబుల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 23: స్థానిక బుట్టాయిపేట శ్రీ చిట్టి పిళ్లారయ్య స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ, భూ, నీలా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. బలగం మహేశ్వర శర్మ దంపతులు స్వామివారి కల్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుడు విష్ణ్భుట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాఠి ఆధ్వర్యంలో శ్రీ సూక్త, దుర్గా సూక్తములతో అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, హరిద్రా కుంకుమలతో స్నపన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఘంటసాల మురళీ మోహన శర్మ అమ్మవారిని కన్నుల పండువగా అలంకరించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు
* డియల్‌పిఓ సత్యనారాయణ
అవనిగడ్డ, మార్చి 23: బందరు సబ్ డివిజన్ పరిధిలోని 112 గ్రామ పంచాయతీల్లో మంచినీటి కొరత లేదని, మరో రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు డివిజనల్ పంచాయతీ అధికారి జె సత్యనారాయణ తెలిపారు. స్థానిక గుర్రప్ప చెరువు పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం ఆయన అవనిగడ్డ వచ్చారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం నిధుల నుండి పైప్‌లైన్‌లు వేసుకోవడం, పంపులను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 6వతేదీ వరకు కాలువలకు నీరు సరఫరా అవనున్నందున చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నింపాలన్నారు. అవనిగడ్డ 1వ వార్డులో డ్రైన్‌ను ఆక్రమించిన ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు. ఇంటి పన్ను వసూళ్లల్లో డివిజన్ వెనుకబడి ఉందన్నారు. కాగా గుర్రప్ప చెరువు వద్ద యుద్ధప్రాతిపదికన ఇంజన్లు ఏర్పాటు చేసి నింపనున్నట్లు చెప్పారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ పృధ్విరాజ్ తదితరులు ఉన్నారు.