కృష్ణ

సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించుకోవడమే గోసంరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, మార్చి 24: గోసంరక్షణ అంటే మన సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించుకోవడమేనని, పకృతిని కాపాడుకోవడం వల్ల మనుషులతో పాటు సకల జీవరాసులు సంతోషంగా ఉంటాయని బలుసుపాడు గురుధామ్ వ్యవస్థాపకులు తాత్వికులు గెంటేల వెంకట రమణ అన్నారు. మండలంలోని వేదాద్రి గోశాలలో జరుగుతున్న శ్రీసురభి గోసంరక్షణ యాగాలలో శుక్రవారం వెంకట రమణ, వసంత లక్ష్మి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హైదరాబాదుకు చెందిన శ్రీమహియి వరాహ ట్రస్ట్ వారు పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన యాగాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర ప్రదేశ్‌లో నూతన ముఖ్యమంత్రి గోసంరక్షణ చర్యలు చేపట్టడం ఆనందం కల్గిస్తోందన్నారు. రాబోయే దశాబ్దాలలో కూడా ఈ యాగాలు మంచి ఫలితాలు ఇచ్చి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా దేశ ప్రయోజనాలు కోరుకోవాలని, ఒకరిని ఒకరు గౌరవించుకునే సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యాగ నిర్వాహకులు కుందుర్తి మహికిరణ్ శర్మ, టి చక్రపాణిరావు, కీసర రాంబాబు, బాచినప్ప కోటేశ్వరరావు, శివానంద భక్తబృందం సభ్యులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులపై
సిబిఐ విచారణ జరిపించాలి
మండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య డిమాండ్
విజయవాడ (పటమట), మార్చి 24: అగ్రిగోల్డ్ సమస్య ఒక్క చంద్రబాబు, జగన్ సమస్య కాదని, 32 లక్షల మంది బాధితులతో ముడిపడి వుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా సమస్యను ఇంతవరకు ప్రభుత్వం పరిష్కరించకపోవటం చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో అసలు సమస్యను పక్కదారి పట్టించి వ్యక్తిగత దూషణలకు దిగటం వల్ల బాధితుల సమస్య ఎలా పరిష్కారం అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ కేసును సిఐడికి అప్పగించి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు బాధితులకు ప్రభుత్వం నాయ్యం చేయటంలో ఎందుకు తాత్పారం చేస్తోందని నిలదీశారు. ఈ విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదన్నారు. సిబిఐ విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు బయటకి వస్తాయని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దల కన్నుపడిందని, అందుకే ఆస్తులను అమ్మటానికి ప్రభుత్వం ముందుకురావటం లేదని ఆరోపించారు. బాధితుల సమస్యను పరిష్కరించాలనే అలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కన్పించటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో బాధితులకు న్యాయం చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.