కృష్ణ

ప్రజలను చైతన్యవంతుల్ని చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మార్చి 27: సమాజంలోని ఇంకా కొనసాగుతున్న రుగ్మతలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వీరంకి వెంకటదాసు సూచించారు. ట్రిపుల్ ఐటీ జాతీయ సేవా విభాగం 1 ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్ అప్పారావు కాలనీలో సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వీరంకి వెంకటదాసు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని రుగ్మతలు కొనసాగుతున్నాయని, వీటిపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనటం విశేషమని చెప్పారు. విద్యార్థులు కాలనీవాసులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కౌన్సిలర్లు మున్షీ, చెన్నారావు, ట్రిపుల్ ఐటీ ప్రతినిధులు సురేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఒ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పోతురెడ్డిపల్లి గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పలు వైద్యపరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.

ఇనామ్ భూముల యజమానులకు న్యాయం చేయండి
జగ్గయ్యపేట, మార్చి 27: ఇనామ్ భూముల అంశంలో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయని వాటి రిజిస్ట్రేషన్లను ఆపు చేయటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తగు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఇనామ్ భూముల అంశాన్ని రాజగోపాల్ ప్రస్తావించారు. పట్టణంలోను నియోజకవర్గ పరిధిలోను ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలో కొంత భూమి దేవాదాయ శాఖకు చెందినదిగా గుర్తించి వాటిని నిషేధిత భూముల జాబితాలో చేర్చాలని ఆ కారణంగా భూముల కొనుగోళ్ళు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో వాటాని అనుభవిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గతంలో దేవాలయాల్లో పని చేసేవారికి ఇనామ్‌ల కింద ఇచ్చిన ఈ భూములను అవసరాల నిమిత్తమై కొందరు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని రిజిస్ట్రేషన్ జరిగే సందర్భంలో దేవాదాయ, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు అభ్యంతరం చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వారు కోరారు.

గన్నవరంలో జగన్‌కు ఘన స్వాగతం
గన్నవరం, మార్చి 27: వైకాపా అధ్యక్షుడు, అసెంబ్లీ ప్రతిపక్ష నేత జగన్‌కు సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. జగన్ హైదరాబాద్ నుండి ఉదయం 9 గంటలకు గన్నవరం చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికినవారిలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు వేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ నగర అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, కైకలూరు ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావుతదితరులున్నా. అనంతరం రోడ్డుమార్గాన జగన్ అమరావతి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు తరలివెళ్లారు.