కృష్ణ

ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 27: జిల్లాలోని ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. దీపం పథకం కింద జూన్ 2వతేదీ నాటికి ప్రతి ఒక్క కుటుంబానికి గ్యాస్ కనెక్షన్‌ను అందచేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్‌లు లేని కుటుంబాలకు జూన్ 2వతేదీ లోపు అందచేయాలన్నారు. జిల్లాలో జరుగుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. గత వారం రోజుల్లో 18 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు (ఓడిఎఫ్)గా ప్రకటించడం జరిగిందన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 434 గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రకటించడం జరిగిందన్నారు. 295 గ్రామాల్లో కేవలం 25 మరుగుదొడ్లు చొప్పున నిర్మిస్తే ఆ గ్రామాలను కూడా ఓడిఎఫ్‌గా ప్రకటించవచ్చన్నారు. మే మాసాంతానికి నూరు శాతం నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే వేసవి దృష్ట్యా ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఇప్పటికే మంచినీటి చెరువులను నింపేందుకు కాలువలకు నీటి విడుదల జరిగిందన్నారు. ఇంకా చెరువులను నింపుకోని వారు తక్షణమే నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మడ వైస్ చైర్మన్ బి వేణుగోపాలరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ఆర్డీవో సాయిబాబు, డ్వామా పిడి రాజగోపాలరావు, జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, సిపిఓ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

రజకుల సంక్షేమంపై చిన్నచూపు తగదు
* కలెక్టరేట్ ఎదుట ధర్నాలో జిల్లా అధ్యక్షుడు చిక్కవరపు

మచిలీపట్నం, మార్చి 27: రజక వృత్తిదారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు చిక్కవరపు వెంకట రెడ్డయ్య ఆరోపించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రజకవృత్తిదారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా నేటికీ రజక వృత్తిదారులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నారన్నారు. వృత్తిని ఆధారం చేసుకుని జీవిస్తున్న తాము నేటికీ వరకు సొంత ఇంటికి కూడా నోచుకోలేదన్నారు. రజక సొసైటీలకు బ్యాంక్‌లతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ ఊసే మరిచారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తమ సంక్షేమానికి పాటుపడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి సొసైటీకీ రూ.7.50లక్షల రుణాలను నేరుగా ఇవ్వాలన్నారు. వృద్ధులైన వృత్తిదారులకు నెలకు రూ.2వేలు పెన్షన్ ఇవ్వాలని, ఉచిత విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని, నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మించాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రజక వృత్తికి దోభిఘాట్లు నిర్మించాలని, రజకుల రక్షణ చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు బలగం విజయశేఖర్, పెదసింగు వెంకటేశ్వరరావు, షేక్ రబ్బాని, మోయుద్దీన్, చేనేత సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచల నరసింహరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సాల్మన్ రాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కాటూరి నాగరాజు, ఉపాధ్యక్షుడు భోగిరెడ్డి వెంకటేశ్వర్లు, బాపట్ల సుబ్బారావు, కార్యదర్శి పెడసనగంటి పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

సుబాబుల్ రైతులకు తక్షణం రూ.10కోట్ల బకాయిలను చెల్లించాలి
పెనుగంచిప్రోలు, మార్చి 24: సుబాబుల్ రైతులకు ఎస్‌పిఎం కంపెనీ చెల్లించాల్సిన రూ.10కోట్ల బకాయిలకు తక్షణం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ముచ్చింతాల గ్రామంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంటలు పండక, వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధరలు లభించక, బకాయిల సొమ్ము రాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్‌పిఎం బకాయిలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గూడపాటి శ్రీనివాసరావు, సర్పంచ్ చావల రామారావు, నాయకులు వడ్డీకాసులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.