కృష్ణ

రొయ్యూరులో మినుము రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మార్చి 28: వందల ఎకరాలలో మినుము పంట నష్టం జరిగితే 50 ఎకరాలను మాత్రమే నమోదు చేయటంపై రొయ్యూరులో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. మినుము రైతుల జాబితా ఆమోదం కోసం ఏర్పాటు చేసిన గ్రామసభను బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగటంతో తహశీల్దార్ భద్రు వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌గవాస్కర్, విఆర్‌ఓ రామ్‌కుమార్ మంగళవారం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభకు రైతులు 150 మంది హాజరయ్యారు. అధికారులు మినుము రైతుల పేర్లను చదివి వినిపించారు. కేవలం 50 ఎకరాలకు సంబంధించి 20 మంది రైతుల పేర్లను మాత్రమే గ్రామసభలో చదవటంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో 750 ఎకరాలలో మినుము వేశామని, 90శాతం రైతులు మినుము పంటను కోల్పోయారని రైతులు అన్నారు. సక్రమంగా ఫీల్డులోకి రాకుండా జాబితాలను తయారు చేశారని ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరటంతో అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో ఆగ్రహించిన రైతులు గ్రామసభను బహిష్కరించి పంచాయతీ ముందు ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ జి భద్రు, ఇన్‌చార్జి వ్యవసాయాధికారిణి జరీనా రొయ్యూరు వచ్చి రైతులతో చర్చించారు. మినుము సాగుచేసిన రైతులందరి పేర్లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని భద్రు హామి ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

జిల్లాలో మద్యం దుకాణాలకు
1538 దరఖాస్తులు

మచిలీపట్నం, మార్చి 28: జిల్లాలో 343 మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి ఇప్పటి వరకు 1538 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో వచ్చినట్లు మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం మనోహ తెలిపారు. మచిలీపట్నం ఎక్సైజ్ ఇఎస్ కార్యాలయ పరిధిలో 175 మద్యం దుకాణాలకు గాను 219 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 53 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. విజయవాడ ఎక్సైజ్ ఇఎస్ పరిధిలో 168 దుకాణాలకు గాను 1319 దరఖాస్తులు రాగా 477 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసుకున్న వారికి ఈ నెల 31వతేదీన కలెక్టరేట్‌లో నిర్వహించనున్న లాటరీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎంట్రీ పాస్‌లను అందజేశారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఆయా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మనోహా తెలిపారు.