కృష్ణ

బందరు బస్తీమే సవాల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 30: ఎంతో అర్థవంతంగా జరగాల్సిన కౌన్సిల్ సమావేశాలు దారి మళ్లుతున్నాయి. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికార, ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకు కౌన్సిల్ సమావేశాలను వేదికగా మలుచుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎదుర్కొని దీటుగా సమావేశాన్ని నడపాల్సిన అధికార పక్షం సంఖ్యా బలంతో అజెండాను ఏకపక్షంగా ఆమోదించి పైచేయి సాధించామని భావిస్తోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశాలన్నీ జరిగిన ఈ తీరులోనే గురువారం నాటి అత్యవసరమైన బడ్జెట్ సమావేశం కూడా జరిగింది. చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అధ్యక్షతన 2017-18 సంవత్సరానికి సంబంధించి రూ.163కోట్ల అంచనాలతో సవరణ బడ్జెట్‌ను తయారు చేసి కౌన్సిల్ ఆమోదానికి ముందుంచారు. అయితే బడ్జెట్ తయారీలో తప్పులు దొర్లాయని, అధికారులు బాధ్యతారాహిత్యంగా బడ్జెట్ తయారు చేశారంటూ ప్రతిపక్ష సభ్యులు సమావేశం ప్రారంభంలోనే ఆందోళనకు దిగారు. కొద్దిసేపు ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. చైర్మన్ బాబాప్రసాద్ జోక్యం చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రూ.163కోట్లతో భారీ బడ్జెట్‌ను తయారు చేశామన్నారు. బడ్జెట్ తయారీలో చిన్నచిన్న లోటుపాట్లు ఉండటం సహజమన్నారు. ఎక్కడైనా తప్పులు ఉంటే సవరణ చేసుకుని ఆమోదించుకునే హక్కు కౌన్సిల్‌కు ఉందని ప్రతిపక్షానికి సూచించారు. దీంతో ప్రతిపక్ష నాయకులు షేక్ అచ్చాబా, మేకల సుబ్బన్న, అస్ఘర్ బడ్జెట్‌లో తయారీలో దొర్లిన తప్పులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే అధికారులు కూడా ప్రతిపక్షాలు ఎత్తిచూపిన తప్పులకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాధం (చంటి), 9వ వార్డు కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్ ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తోందని ప్రతిపక్ష సభ్యులపై ధ్వజమెత్తారు. దీంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమై ఒకానొక దశలో వ్యక్తిగత దూషణలకు దిగారు. అలాగే రాజకీయ విమర్శలు చేసుకున్నారు. అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో అవినీతి కూడా అంతే వేగంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారంటూ ప్రతిపక్ష సభ్యులు వ్యాఖ్యానించగా అవినీతికి పరాకాష్ట మీ అధినేత జగన్ అంటూ అధికార పక్షం విమర్శలు చేసింది. ఈ విషయంలో వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ప్రతిపక్ష కౌన్సిలర్ మేకల సుబ్బన్న బల్లలుగుద్ది మరీ విమర్శలు చేసుకోవటంతో కౌన్సిల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలోనే ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం సమావేశాన్ని తప్పుదారి పట్టించేందుకే ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బడ్జెట్‌ను తామంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చెప్పారు. దీంతో చైర్మన్ బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. చైర్మన్ వ్యవహరించిన తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా గర్హించారు. చైర్మన్ వెళ్లిపోయిన తర్వాత కూడా చైర్మన్ పోడియం ముందు బైఠాయించి అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పుల తడకగా తయారు చేసిన బడ్జెట్‌ను ఏకపక్షంగా ఆమోదించడం దుర్మార్గమన్నారు. ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ తన ఛాంబర్‌లో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. గతంలో ఏ పాలకవర్గం ప్రవేశ పెట్టని విధంగా రూ.163కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత తమకే దక్కుతుందన్నారు.