కృష్ణ

సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 30: నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం నేడు నిర్వహించనున్న మద్యం దుకాణాల లైసెన్సు మంజూరు ప్రక్రియకు అబ్కారీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 343 మద్యం దుకాణాలకు నూతన లైసెన్సులను లాటరీ ద్వారా మంజూరు చేయనున్నారు. ఇందుకు కలెక్టరేట్ సమావేశ మందిరాన్ని వేదికగా మార్చారు. శనివారం మధ్యాహ్నం 2గంటల నుండి మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోని మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిన లైసెన్సులు మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 24వతేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా గురువారం రాత్రి 8గంటలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ విడత శ్లాబ్ ధరలు గణనీయంగా తగ్గటంతో దరఖాస్తులు కూడా అదే స్థాయిలో వచ్చాయి. మొత్తం 343 మద్యం దుకాణాలకు సుమారు 8వేల 753 దరఖాస్తులు వచ్చినట్లు విజయవాడ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ గురువారం రాత్రి ఆంధ్రభూమి ప్రతినిధికి ఫోన్‌లో తెలిపారు. రాత్రి 9గంటల సమయానికి 7వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. రూ.42కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. మచిలీపట్నం ఎక్సైజ్ ఇఎస్ పరిధిలో ఉయ్యూరులో రెండు దుకాణాలు, గుడివాడలో ఒక దుకాణానికి దరఖాస్తులు రాలేదు. విజయవాడ ఇఎస్ పరిధిలోని అన్ని దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. అర్ధరాత్రి వరకు దరఖాస్తుల పరిశీలన ఆయా ఎక్సైజ్ ఇఎస్ కార్యాలయాల్లో కొనసాగింది. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 168 మద్యం దుకాణాలకు గాను 5వేల 953 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 5వేల 109 దరఖాస్తుల పరిశీలన పూర్తవ్వగా రిజిస్ట్రేషన్ ఫీజు, దరఖాస్తు ఫీజుల రూపేణా రూ.32కోట్లు వరకు ఆదాయం లభించింది. అలాగే మచిలీపట్నం ఎక్సైజ్ ఇఎస్ పరిధిలో 175 దుకాణాలకు గాను 172 దుకాణాలకు 2వేల 800 దరఖాస్తులు వచ్చాయి. 2వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. సుమారు రూ.11.50కోట్ల మేర ఆదాయం లభించింది. రెండు ఇఎస్‌ల పరిధిలో దరఖాస్తుల పరిశీలన పూర్తిగా అయితే మరో ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది జిల్లాలో 7వేల 334 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది అదనంగా 1419 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఆదాయం కూడా గత ఏడాది రూ.26.95 కోట్లు రాగా ఈ ఏడాది సుమారు 42కోట్లు వచ్చింది. రెండింతలు ఆదాయం అదనంగా రావడం విశేషం. మచిలీపట్నం ఎక్సైజ్ ఇఎస్ పరిధిలో ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీ తగ్గింది. గతంలో 3వేల 300 దరఖాస్తులు రాగా ప్రస్తుతం 2వేల 800 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఆదాయం కూడా అటు ఇటుగా అంతే వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది రూ.14.45కోట్లు ఆదాయం ఉండగా సుమారు రూ.15కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన అధినేత
పవన్‌కు ఘనస్వాగతం
గన్నవరం, మార్చి 30: గన్నవరం ఎయిర్‌ర్టులో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు.
విజయవాడలో జరిగే అగ్రిగోల్డు బాధితుల సమావేశంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడకు వెళ్లారు. 4.40కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చి 5.30 గంటలకు ఎయిర్‌ఇండియా విమానంలో తిరిగి హైదరాబాద్ వెళ్లారు. అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.