కృష్ణ

టెన్త్ మూల్యాంకనం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 3: స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో సోమవారం పదవ తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈనెల 16వ తేదీ వరకు జరిగే ఈ స్పాట్‌లో సుమారు 5లక్షల 80వేల సమాధాన పత్రాల మూల్యాంకనం జరగనుంది. రోజుకు సుమారు 42వేల సమాధాన పత్రాల మూల్యంకనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 1600 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. వీరిలో 165 మంది ప్రధాన పర్యవేక్షకులు, వెయ్యి మంది సహాయక పర్యవేక్షకులు, 165 మంది సహాయకులు, 20 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, 20 మంది ఇతరులు పాల్గొంటున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా డిఇఓ ఎ సుబ్బారెడ్డి, డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ (స్ట్రాంగ్ రూమ్)గా పిఎస్‌ఆర్‌కె లింగేశ్వరరావు, డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్స్ (పరిపాలన)గా బందరు డివైఇఓ గిరికుమారి, నూజివీడు డివైఇఓ ఎన్ రవిసాగర్ వ్యవహరిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని
బంధువుల ఆగ్రహం
జగ్గయ్యపేట, ఏప్రిల్ 3: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ శిశువు మృతి చెందిందినట్లు బంధువులు ప్రభుత్వ వైద్యశాలలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పట్టణంలోని విలియంపేటకు చెందిన కటికల మరియమ్మ, రవికుమార్‌ల కథనం ప్రకారం గత నెల 31న తాము ప్రభుత్వ వైద్యశాలకు కాన్పుకోసం వచ్చామని రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కాన్పుకు తీసుకొనివెళ్లారని, రాత్రి 1.30 ప్రాంతంలో బిడ్డ ఉమ్మనీరు తాగిందని కోదాడ తీసుకెళ్లమని తమకు చెప్పారని, పిల్లల డాక్టర్‌కు మరో డాక్టర్‌కు విషయం చెప్పి రమన్నా తమ డ్యూటీ కాదని రాలేదని వారు ఆరోపించారు. తాము అర్ధరాత్రివేళ కోదాడకు తీసుకువెళ్లామని అక్కడ కాదంటే ఈ నెల 1న ఖమ్మం తీసుకొని వెళ్లామని, సోమవారం ఉదయం ఖమ్మం వైద్యులు పిల్లని విజయవాడకు తీసుకొనివెళ్లమని సూచించటంతో విజయవాడకు తీసుకొనివెళుతుండగా మార్గం మధ్యంలో పిల్ల చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోర్ లీడర్ యలమంచలి రాఘవ, పట్టణ పార్టీ అధ్యక్షుడు మేకా వెంకటేశ్వర్లు వైద్యశాలకు వచ్చి బాధితులతో మాట్లాడారు. ఈ విషయమై వైద్యశాల ఇన్‌చార్జి డాక్టర్ చిత్రను వివరణ కోరగా కాన్పు కష్టమైనా, పిల్లలకు అత్యవసర పరిస్థితి ఏర్పడ్డా బయటకు తీసుకొనివెళ్లాలని ముందే చెప్పామని, పుట్టగానే ఉమ్మనీరు బాగా తాగి ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా దగ్గరవున్న కోదాడకు తీసుకొనివెళ్లమని సూచించామని చెప్పారు. మూడు రోజులు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉంచి ఇప్పుడు తమ కారణంగా పిల్ల మృతి చెందిందనటం భావ్యం కాదని అన్నారు. దీనిపై విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.