కృష్ణ

ఆయేషా మీరా హత్య కేసును పునః విచారణ జరిపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఏప్రిల్ 3: ఆయేషా మీరా హత్య కేసును పునః విచారణ జరిపించి అసలైన దోషులను వెలికి తీయిస్తామని, దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. సోమవారం అనాసారంలో నిర్దోషిగా విడుదలైన పిడతల సత్యంబాబును స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పరామర్శించారు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించానని, నిరుపేద కుటుంబమైన తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా సత్యంబాబు ఆమెను వేడుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ కోర్టు తీర్పుతో తప్పుచేసిన పోలీసు అధికారులు తలవంచుకోవాలన్నారు. అయేషా తల్లి దండ్రుల ఆవేదనను అప్పుడు పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే అన్యాయం జరిగిందన్నారు. అప్పటి పోలీసులు ఎవ్వరి ఒత్తిడి వల్ల తప్పుడు కేసులు నమోదు చేశారో కూడా విచారణ జరిపిస్తామన్నారు. కోర్టు తీర్పు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు విచారణ జరిపిన అధికారులపై కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అయిన సత్యంబాబు ఆదివారం రాత్రి అనాసాగరానికి చేరుకోగా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

‘కొల్లు’కు అభినందనల వెల్లువ

మచిలీపట్నం, ఏప్రిల్ 3: న్యాయ, యువజన, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా నియమితులైన స్థానిక ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు అభినందనలు వెల్లువెత్తాయి. శాఖలు ఖరారు అయిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి రవీంద్ర నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు, దుశ్శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), మండల పరిషత్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, మండల అధ్యక్షుడు తలారి సోమశేఖర్, పార్టీ నాయకులు అక్కమహంతి రాజా, సయ్యద్ ఖాజా, అబ్దుల్ అజీమ్, మాదిరెడ్డి శ్రీనివాస్, గడ్డం రాజు తదితరులు అభినందనలు తెలిపారు.