కృష్ణ

యువకెరటాలు విజేతలకు బహుమతుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 9: గత జనవరి నెలలో నిర్వహించిన యువకెరటాలు-2017లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం బహుమతులు అందజేశారు. స్థానిక టౌన్‌హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. యువత శక్తియుక్తులను వెలికి తీసేందుకు ప్రతి యేడాది జనవరిలో యువ కెరటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, టిడిపి సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
* భర్తపై అనుమానాలు * రెండేళ్ల కిందట ప్రేమ వివాహం
తోట్లవల్లూరు, ఏప్రిల్ 9: తోట్లవల్లూరులో ఆదివారం సినిమా హాలు బజారులో వివాహిత చలంచలం అంబిక (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోట్లవల్లూరుకు చెందిన చలం చలం శ్రీను తాపీపని, టైల్స్‌వర్క్ చేస్తుంటాడు. తాపీ పనులపై రెండేళ్ళ కిందట గుంటూరు జిల్లా మంగళగిరికి వెళ్ళాడు. అక్కడ అంబికని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్ళిని అంబిక తల్లి వ్యతిరేకించటంతో మంగళగిరిలో నాలుగు నెలలు శ్రీను, అంబిక వేరేచోట ఉన్నారు. తర్వాత ఏడాదిన్నర కిందట అంబికను తీసుకుని శ్రీను తోట్లవల్లూరు వచ్చాడు. తల్లిదండ్రులు ఏడుకొండలు, వెంకటరమణ అభ్యంతరం చెప్పక పోవటంతో వారివద్దే ఉంటు ఉమ్మడిగా జీవిస్తున్నారు. అత్త వెంకటరమణతో కలిసి పొలం పనులకు వెళుతుండేది. అయితే శనివారం రాత్రి భార్యభర్తల మధ్య వివాదం జరిగినట్టుగా చెపుతున్నారు. దాంతో తినే అన్నం మధ్యలో వదిలివేయటంతో ప్లేటులో అన్నం మిగిలివుంది. భర్త శ్రీను చెప్పిన వివరాల ప్రకారం శనివారం రాత్రి ఇద్దరం కలిసి పడుకున్నాము, ఒకసారి లేచి బయటకు వెళ్ళి వచ్చింది. మళ్ళీ రాత్రి 11.30 గంటల సమయంలో బయటకు వెళ్ళింది. తాపీ పని చేసి ఉండటం వల్ల గాఢనిద్రలోకి వెళ్ళాను. తెల్లవారుఝామున 5 గంటలకు లేచి చూస్తే భార్య లేదు. పనులు చేస్తుందేమో అనుకుంటు బ్రష్ చేసుకునేందుకు మరుగుదొడ్డి వైపు వెళ్ళగా అందులో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించిందన్నాడు. దాంతో మృతదేహాన్ని తాను ఒక్కడినే కిందికి దించినట్టు శ్రీను పోలీసులకు తెలిపాడు. పుట్టింటి వైపునుంచి ఎవరు రావటంలేదని అంబిక బాధపడుతు ఉండేదని శ్రీను చెప్పాడు. తల్లికి దూరమయ్యానని బాధపడుతు మూడుసార్లు తన ఎదుటే చీరను మెడకు చుట్టుకుని చనిపోతానని బెదించిందని శ్రీను చెప్పాడు. ఎస్‌ఐ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. శ్రీను వద్ద ఫోన్ నెంబర్లు తీసుకుని అంబిక తల్లికి, మేనమామలకు పోలీసులు సమాచారం అందించారు. సాయంత్రానికి మృతురాలి తల్లి ఏలూరి వెంకటేశ్వరమ్మ తోట్లవల్లూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీంతో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామని ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.