కృష్ణ

19వ వార్డు టిడిపి కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 11: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన స్థానిక 19వ వార్డు ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్థి నండూరి వీరవెంకట ప్రసాద్ ఘన విజయం సాధించారు. మంగళవారం స్థానిక ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపులో సమీప వైసిపి అభ్యిర్థి గణపతి సూర్యనారాయణపై 149 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఈ వార్డులో మొత్తం 2,905 మంది ఓటర్లు ఉన్నారు. ఆదివారం జరిగిన పోలింగ్‌లో 2,234 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మూడు రౌండ్‌లుగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. మొదటి రౌండ్‌లో టిడిపికి 437 ఓట్లు, వైసిపికి 347 ఓట్లు, కాంగ్రెస్ 9 ఓట్లు లభించాయి. 2వ రౌండ్‌లో టిడిపికి 352 ఓట్లు, వైసిపికి 364 ఓట్లు, కాంగ్రెస్‌కు 8 ఓట్లు, 3వ రౌండ్‌లో టిడిపికి 388 ఓట్లు, వైసిపికి 287 ఓట్లు, కాంగ్రెస్ 3 ఓట్లు వచ్చాయి. దీంతో 19వ వార్డు కౌన్సిలర్ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకున్నట్టుగా ఎన్నికల అధికారి బండి శేషన్న ప్రకటించారు. అనంతరం నండూరి విజయాన్ని నిర్ధారిస్తూ ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్ అడపా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు అదనపు వేతనాలు ఇవ్వండి
* మే మాసాంతానికి జిల్లాను ఓడిఎఫ్‌గా ప్రకటించాలి * జూన్ నాటికి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ పూర్తిచేయాలి * పిఎంఎవై కింద జిల్లా అదనంగా మరో 7వేల గృహాలు * మండలాల వారీగా కేటాయింపులకు చర్యలు తీసుకోవాలి * ‘మీకోసం’లో కలెక్టర్ బాబు.ఎ

మచిలీపట్నం, ఏప్రిల్ 10: ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి ఉపాధి హామీ కూలీలకు అదనపు వేతనాలు ఇవ్వాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో పలు అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలకు సంబంధించి 30 శాతం, జూన్ నెలకు సంబంధించి 20 శాతం అదనపు కూలీ ఇవ్వాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మధ్యాహ్నం 12గంటల నుండి 3గంటల మధ్య కూలీలతో పని చేయించవద్దని సూచించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతంలో కూలీలకు నీడ కల్పించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 507 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాలను కూడా మే మాసాంతానికి ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం కింద ఇంకా లక్ష వరకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జూన్ నాటికి పంపిణీ పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాకు అదనంగా 7వేల గృహాలు మంజూరైనట్లు చెప్పారు. మండలాల వారీగా కేటాయింపులు చేయాలన్నారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 8వేల గృహాలు గ్రౌండింగ్ కాగా 3వేల 500 గృహాల నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిఆర్‌ఓ చెరుకూరి రంగయ్య, జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, ఆర్డీవో సాయిబాబు, సిపిఓ రత్నబాబు, డిఇఓ ఎ సుబ్బారెడ్డి, డ్వామా పిడి రాజగోపాలరావు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.