కృష్ణ

భూగర్భ జలాల పెంపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్టవ్య్రాప్తంగా 90 రోజులపాటు నీరు-ప్రగతిపై అవగాహన కార్యక్రమాలు జూలై 20 వరకు ఒక ఉద్యమంలా చేపడుతున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. గురువారం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సైంటిస్టులు, విద్యార్థినీ విద్యార్థులతో సబ్ కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నీరు-ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలతో పాటు మేధావులు, విద్యార్థినీ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నామన్నారు. నీటి ఆవశ్యకతను తెలిపి భూగర్భ జలాల స్థాయిని పెంచేలా భారీగా కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రం విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఉత్తరాంధ్రలో 1217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే రాయలసీమ జిల్లాల్లో కేవలం 450 మి.మీటర్లు నమోదు అయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రక్రియ చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను రియల్ టైమ్ మానిటరీ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నందున పనుల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 1500 అడుగులకు బోర్లు వేసే పరిస్థితి నెలకొందని మంత్రి రవీంద్ర వివరించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ నీటి కోసం డబ్బులు ఖర్చుచేసుకునే రోజులు వచ్చాయని, దీన్ని అధిగమించడానికి నీరు-ప్రగతి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జలవనరులను పెంపొందించుకోడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూగర్భ జలాలు పెంచుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాగుకుంటల వల్ల పంటలను కాపాడుకోవచ్చని, మొక్కలను సంరక్షించుకోవచ్చన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పెంపుదలకు 15వేల చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అనూరాధ వివరించారు. సభకు అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నీరు-ప్రగతి ఉద్యమం జిల్లాలో ప్రణాళికాబద్ధంగా అమలుపర్చడానికి కార్యక్రమం రూపొందించామన్నారు. దీనికోసం ఆయా విభాగాలతో పాటు మేధావులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ద్వారా నీరు-ప్రగతి ఉద్యమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్-2 కింద జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ద్వారా 5వేల బోర్లు వేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రుడు తెలిపారు. ఎపి స్పేస్ రీసెర్చ్ అప్లికేషన్ సెంటర్ సీనియర్ సైంటిస్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ఇస్రో ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో జలవనరులను పెంపొందించేలా చెక్‌డ్యాంలను గుర్తిస్తామన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా, పంటలు పండించుకునేలా తమ సంస్థ సహకారం అందిస్తుందని వివరించారు. సమావేశంలో జలవనరుల శాఖ కృష్ణా డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీరు వై సుధాకర్, సెంట్రల్ డివిజన్ ఆర్గనైజర్ గిరిధర్ రెడ్డి, డిడబ్ల్యుఎంఎ పీడీ బి రాజగోపాల్, పిడిఎపిఎంఐపి రవికుమార్ నీరు-ప్రగతిపై చేపడుతున్న విధానాలను వివరించారు. సబ్ కలెక్టర్ చక్రపాణి, డిఆర్‌డిఎ పీడీ చంద్రశేఖరరాజు, అగ్రికల్చర్ జెడీ నరసింహరావు, అగ్రికల్చర్ ఎడి సుజాత, ఎపిఎస్సార్ ఎసి వైస్ ఛైర్మన్ డా. కెవి రమణ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. సబ్ కలెక్టరేట్ ఆవరణలో డ్వామా, అటవీ, ఎపిఎంఐపి, తదితర శాఖలు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాయి.