కృష్ణ

శరవేగంగా కృష్ణా పైపులైన్ విస్తరణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 27: మైలవరం పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు 13,14 వ ఆర్థిక సంఘం నిధులు 14 లక్షల రూపాయలతో ఫ్లోరైడ్ రహిత కృష్ణానది నీటిని అందించేందుకు పైప్‌లైన్ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మైలవరం నుండి విజయవాడ వైపువెళ్ళే ప్రధాన రహదారిలో, మైలవరం బోసుబొమ్మ సెంటరు నుండి ప్రభుత్వ జూనియర్ కలశాల వరకూ ప్రధాన రహదారి పక్కనే ప్రధాన పైప్‌లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వేస్తున్న ప్రధాన పైప్‌లైన్‌కు అంతర్గత పైప్‌లైన్ల లింకు కలిపి అన్ని అంతర్గత రహదారులకు విస్తరించి తద్వారా ఇళ్ళకు ట్యాప్‌లు ఏర్పాటు చేసే విధంగా పనులు కొనసాగిస్తున్నారు. ప్రతి వీధిలోని ప్రతి ఇంటికి ఫ్లోరైడ్ రహిత కృష్ణా జలాలను అందించాలన్న లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ నందేటి కృష్ణవేణి, కార్యదర్శి రఫి వెల్లడించారు. పట్టణ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను మంజూరు చేయించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా పైప్‌లైన్ విస్తరణ పనులను వారు పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మండుటెండలో పైప్‌లైన్ విస్తరణ పనులు చేస్తున్న సిబ్బందికి పంచాయితీ కార్యదర్శి రఫి మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ, శానిటరీ ఇనస్పెక్టర్ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా సామూహిక లలితా సహస్రనామ పారాయణ ప్రారంభం
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 27: స్థానిక గాంధీ బొమ్మ శివాలయం ప్రాంగణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న 26వ వార్షిక ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా గురువారం లలితా సహస్రనామ పారాయణ వైభవంగా ప్రారంభమైంది. వెయ్యి మందికి పైగా సువాసినులు అత్యంత భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష అర్చనలు నిర్వహించారు. వారం రోజులు పాటు సామూహిక లలితా సహస్రనామ పారాయణ జరుగుతుందని ధర్మశాస్త భక్తబృందం కార్యదర్శి దేసు రాంబాబు తెలిపారు.