కృష్ణ

మంచినీళ్లెప్పుడిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఏప్రిల్ 29: ఐదు రోజులు నుండి మంచినీరు రాకపోవటంతో స్థానిక 9వ వార్డుకు చెందిన ప్రజలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజుల నుండి ఈ వార్డుకు కుళాయిల ద్వారా మంచినీరు రావడంలేదు. స్థానికుల కోరికమేరకు శుక్రవారం తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠమనేని రవిశంకర్ ఒక రోజు వాటర్ ట్యాంకర్ పంపారు. శనివారం నాటికి మంచినీరు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చి పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఈ వార్డు మహిళలకు జనసేన కార్యకర్త రాయపూడి వేణుగోపాలరావు మద్దతు తెలిపారు.

మాజీ కౌన్సిలర్ ‘నారగాని’ సేవలు చిరస్మరణీయం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 29: మాజీ కౌన్సిలర్ నారగాని మాధవరావు పట్టణాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. పురపాలక సంఘ సాధారణ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. కౌన్సిలర్‌గా సేవలు అందించిన మాధవరావు గత నెల 30వతేదీన మృతి చెందారు. మాధవరావు మృతి పట్ల సంతాపం తెలియజేసి కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వాయిదా వేశారు. కౌన్సిలర్‌గా మాధవరావు చేసిన సేవలను మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్‌తో పాటు వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథం, ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా తదితరులు కొనియాడారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, నారగాని ఆంజనేయ ప్రసాద్, బత్తిన దాస్, శీలం బాబ్జి, లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, అస్ఘర్, కోసూరు నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా వేంకటేశ్వరుని అలయ శంకుస్థాపన
హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 29: బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. శనివారం ఉదయం 11:16లకు గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ సత్యానంత భారతి స్వాముల పర్యవేక్షణలో వేదమంత్రాల నడుమ, ఆగమనశాస్త్ర ప్రకారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకుస్థాపన పూజాకార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణ, ప్రధాన దాత ఆళ్ళ జితేంద్ర ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరుని దేవస్థానం రంగన్నగూడెం గ్రామంలో నిర్మించడం శుభపరిణామమని, అలయ నిర్మాణం వేగంగా పూర్తికావాలని భువనేశ్వరి పీఠాధిపతులు సత్యానంద భారతి స్వామి అక్షాంక్షించారు. శంకుస్థాపన కార్యక్రమంలో రంగన్నగూడెం గ్రామస్థులు, మల్లవల్లి, వీరవల్లి, సింగన్నగూడెం, కొయ్యూరు గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.