కృష్ణ

ఇక అతి వేగానికి కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), ఏప్రిల్ 30: రోజు రోజుకీ రాష్ట్రంలో పెరుగుతున్న వాహన ప్రమాదాలను నియంత్రించేందుకు రవాణాశాఖ నూతన విధానంతో ముందుకు వస్తోంది. మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనం నడపడం కారణంగానే రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని భావిస్తున్న రవాణాశాఖ ప్రమాదాలను నియంత్రించే క్రమంలో హైవేల వెంబడి మద్యం షాపులను తొలగించడంతో పాటు, వాహన వేగాన్ని నియంత్రించే ఎస్‌ఎల్‌డి (స్పీడ్ లిమిటెడ్ డివైస్) విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ఇక ప్రయాణ వేగం గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్లు లోపే ఉండనుంది. రవాణాశాఖ నూతనంగా తీసుకు వస్తున్న విధానం ద్వారా చిన్న వాహనం నుండి భారీ వాహనాలకు ఇక తప్పని సరిగా స్పీడీ లిమిట్ డివైస్‌ను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరం ఆటోలతో పాటు భారీ వాహనాలకు వేరు వేరుగా వేగాన్ని నియంత్రిస్తోంది. ఆటోలతో పాటు చిన్నిపాటి వాహనాలకు 60 కిలోమీటర్లలోపుగా, భారీ వాహనాలకు గంటకు 80 కిలో మీటర్ల మాత్రమే ప్రయాణించేలా వేగాన్ని నియంత్రిస్తోంది. దీని కారణంగా వాహనాల వేగం తగ్గడంతో రోడ్టు ప్రమాదాలు కూడా గరిష్టంగా తగ్గుతాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్త, పాట వాటికి తప్పనిసరి
కొత్తగా కొనుగోలు చేసిన ప్రతీ వాహనానికి తప్పనిసరిగా ఎస్‌ఎల్‌డి పరికరాన్ని అమర్చుకోవాల్సిందే. అలాగే పాత వాహనాలు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్‌తో పాటు కొనుగోలు చేసే సమయంలో తప్పని సరిగా పరికరం ఉంటేనే ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్, వాహన పేరుల బదిలీ వంటి వాటికి అనుమతులు ఇస్తామని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తప్పని సరిగా ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ పరికారాన్ని అమర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను, అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు. రవాణాశాఖ నూతనంగా తీసుకు వస్తున్న ఈ విధానం ద్వారానైనా రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు తగ్గ, మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.