కృష్ణ

‘మాతృత్వ సురక్షా యోజన’ అమలు తీరు మెరుగుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 9: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన మాతృత్వ సురక్షా యోజన పథకం అమలు తీరు పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ప్రతి నెలా 9వతేదీన గర్భిణులు నేరుగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలోని స్పెషలిస్టులతో ఫోన్‌లో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలపాల్సి ఉంటుంది. ఆ వైద్యుల సూచనల మేరకు స్థానిక వైద్యులు వైద్య సేవలు అందిస్తారు. అయితే దీని అమలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని మంగళవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రుల తనిఖీ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధతో కలిసి ఆయన దేశాయిపేటలోని సిఎం ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దేశాయిపేటలోని సిఎం ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన మంత్రి మాతృత్వ సురక్షా యోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న గర్భిణీలతో అపోలో ఆస్పత్రిలోని టెలికన్సల్టెన్సీకి ఫోన్ చేయగా అటు నుండి స్పందన కరువైంది. అరగంట వరకు ఫోన్‌లోకి ఏ స్పెషలిస్టు వైద్యుడు అందుబాటులోకి రాలేదు. మంత్రి వెళ్లిపోతుండగా స్పెషలిస్టు వైద్యుడు ఫోన్‌లోకి అందుబాటులోకి రావటంతో వెనక్కి వచ్చిన మంత్రి సంబంధిత స్పెషలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలు ఫోన్ చేసిన వెంటనే స్పందించాల్సిన బాధ్యత మీపై ఉందని, ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి వైద్యుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని వైద్యాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎం కామేశ్వర ప్రసాద్, జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

దివిసీమ జీవన విధానాలకు అద్దంపట్టిన బౌద్ధ క్షేత్రాలు
* బుద్ధప్రసాద్
చల్లపల్లి, మే 9: అందరికీ సమాన హక్కులు అనే భావనను బౌద్ధమతం చెబుతోందని, అన్ని మతాల కంటే బౌద్ధ మతంలో శాస్ర్తియత కనిపిస్తుందని జెసి గంధం చంద్రుడు అన్నారు. ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని ప్రబోధించిన గౌతమబుద్ధుని 2,561వ జయంతి వేడుకలు ఘంటసాలలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఘంటసాల ఘన చరిత్ర-బుద్ధుని బోధనలపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసెంబ్లీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ సదస్సులో జిల్లా జాయింటు కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ 2,500 సంవత్సరాల క్రితమే బౌద్ధమతం స్ర్తి, పురుషుల సమానత్వాన్ని పాటించటం గొప్ప విషయమన్నారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను గుర్తించటంతో పాటు వాటి విశిష్టతను ఇనుమడింప చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గౌతమబుద్ధుని 2561వ జయంతి ఉత్సవాలు ఘంటసాలలో సదస్సుగా నిర్వహించుకోవటంతో పాటు పెద్ద ఎత్తున బౌద్ధ్భిక్షువులు కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, పూర్వ ఉప కులపతి వై కేశవ దుర్గాప్రసాద్, పర్యాటక శాఖ ఏడి వి మల్లిఖార్జునరావు, బౌద్ధ ధర్మాచారి, ప్రవాస భారతీయుడు గొర్రెపాటి రంగనాధ్‌బాబు తదితరులు బుద్ధుని బోధనలు వివరించారు. ఈ సదస్సులో పూజ్య భిక్షు, దమ్మద్వజ బంతీజి, బందరు ఆర్డీఓ పి సాయిబాబు, మొవ్వ మార్కెట్ యార్డు చైర్మన్ తుమ్మల చౌదరిబాబు, జెడ్పీటిసి తుమ్మల వరలక్ష్మి, ఎంపిపి అందే సూర్య భవాని, సర్పంచ్ నాగరత్నం, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత బౌద్ధ భిక్షువుల ఆధ్వర్యంలో బుద్ధుని విగ్రహం వద్ద నుండి మహాచైత్యం వరకు శాంతి యాత్ర జరిగింది.