కృష్ణ

అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 17: అవినీతిని ప్రశ్నించినందుకే తమ పార్టీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ మేకల సుబ్బన్నను అకారణంగా కౌన్సిల్ సమావేశం నుండి సస్పెండ్ చేశారని మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్‌ఆర్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సుబ్బన్న సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు గొంతునొక్కే విధంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గడిచిన మూడేళ్ల నుండి ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ అజెండాపై చర్చించకుండా సంఖ్యా బలం ఉందన్న కారణంతో ఏకపక్షంగా ఆమోదించుకుపోతున్నారన్నారు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలను కూడా ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ బాబాప్రసాద్ స్వతహాగా నిర్ణయాలు తీసుకోకుండా ఇద్దరు, ముగ్గురు టిడిపి కౌన్సిలర్లు ఏం చెబితే అది చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైసిపి కౌన్సిలర్లు శీలం బాబ్జి, లంకా సూరిబాబు, గూడవల్లి నాగరాజు, అస్ఘర్, మట్టా విజయలక్ష్మి, ధనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు అంగీకరిస్తే పంటకుంటను తవ్వి అప్పగిస్తాం
తోట్లవల్లూరు, జూన్ 17: రానున్న రోజుల్లో వ్యవసాయానికి పంటకుంటలపై ఆధారపడే పరిస్థితులు వస్తాయని, అందుచేత ప్రతిరైతు తమ పొలంలో సామాజిక బాధ్యతగా పంటకుంటలను తవ్వించాలని వ్యవసాయాధికారిణి అనితాభాను అన్నారు. మండలంలోని పెనమకూరు శివారు ముదిరాజుపాలెం పొలాల్లో శనివారం మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు పంటల సరళి ఆధారిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయాధికారిణి అనితాభాను మాట్లాడుతూ మండలంలో 14 చోట్ల పంటకుంటలు తవ్వారని, మిగతా రైతులు ముందుకు రావాలని కోరారు. పంటకుంట తవ్వకానికి రైతులు అంగీకరిస్తే, ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద పంటకుంటను తవ్వి అప్పగిస్తారని అన్నారు. పశువులు ఉన్న రైతులు వర్మికంపోస్ట్ యూనిట్లను ప్రారంభించాలని అనితాభాను కోరారు. ఇంకా ఉద్యానాధికారిణి శ్రీలక్ష్మీ, ఏవో ఎస్‌కె జరీనా, గ్రామసర్పంచ్ సూరపనేని వెంకటేశ్వరరావురైతులకు పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతినిధి రవి, మాజీ సర్పంచ్ పి వెంకటేశ్వరరావు, ఏఈవో లక్ష్మణరావుతదితరులు పాల్గొన్నారు.