కృష్ణ

ముందుకు సాగని విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల హేతుబద్ధీకరణ అంశం వివాదాస్పదంగా మారింది. హేతుబద్ధీకరణ అంశాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. వారం రోజుల క్రితమే పాఠశాలల పునః ప్రారంభం కాగా హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల బదిలీ అంశంతో ఉపాధ్యాయులెవ్వరూ పాఠశాలలకు రావడం లేదు. ఉపాధ్యాయ సంఘ నేతలు ఉద్యమానికి బాసటగా నిలిచేందుకు సభలు, సమావేశాలు అంటూ తిరుగుతుండగా ఉపాధ్యాయులు మాత్రం తమకు కావల్సిన ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రజా ప్రతినిధుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన కొండెక్కింది. వేలాది రూపాయలు కార్పొరేట్ సంస్థలకు చెల్లించలేని సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తుండగా, ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించండంటూ వీధివీధి తిరిగిన ఉపాధ్యాయులు మాత్రం బదిలీలు అంటూ బడులు మాని పైరవీలు సాగిస్తుండటం తల్లిదండ్రులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా హేతుబద్ధీకరణను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమం రోజు రోజుకీ ఉధృతమవుతోంది. ఇప్పటికే పలు విడతలు కలెక్టరేట్, తాలుకా కార్యాలయాలు, ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాలు బుధవారం జిల్లా విద్యా శాఖ కార్యాలయ ముట్టడికి సిద్ధమయ్యాయి. అన్ని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు డిఇఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. హేతుబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం కూడా రోజుకొక నిబంధనలను తీసుకు వస్తుండటం, పదే పదే షెడ్యూలును మార్పు చేస్తుండటం ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తోంది. ఒక పక్క పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులవుతున్నా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించిన పరిస్థితి కనిపించడం లేదు. మరో పక్క హేతుబద్ధీకరణ అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో విద్యా బోధన గందరగోళంగా మారింది. సమయం కాని సమయంలో హేతుబద్ధీకరణ అంశాన్ని తెర మీదకు తీసుకు వచ్చిన ప్రభుత్వం తమ పిల్లల విద్యాబుద్ధులతో చెలగాటమాడుతోందని తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.