కృష్ణ

నవరత్నాల అమలుతోనే పేదల బతుకుల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 18: వైసీపీ ఆధ్వర్యంలో జగన్ నేతృత్వంలో అమలయ్యే నవరత్నాల పథకాల అమలుతోనే పేదల బతుకుల్లో వెలుగులు ప్రసరిస్తాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన మైలవరం పట్టణంలోని చంద్రబాబునగర్ నుండి పాదయాత్రగా ఆదాంపురం, బాలికోన్నతపాఠశాల ఏరియా, రాజాపేటలలో విస్తృతంగా ఇంటింటికీ తిరిగి నవరత్నాల పధకాలకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఆయా ప్రాంతాలలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వైసీపీ ఆధ్వర్యంలో జగన్ ముఖ్యమంత్రి ఐతేనే నవరత్నాల పధకాలు అమలై రాపేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. ఈసందర్భంగా జోగికి ఆయా ప్రాంతాలలో ప్రజలనుండి అనూహ్య స్పందన లభించింది. ఈకార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ కరీమ్, పార్టీ నేతలు రవూఫ్, నాగులూరి బ్రదర్స్, ననే్నబాబు, బూత్ కన్వీనర్లు, వార్డు మెంబర్లు పలువురు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల తహశీల్దార్ కార్యాలయ ముట్టడి
బంటుమిల్లి, సెప్టెంబర్ 18: సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత కార్యాలయానికి తాళాలు వేసేందుకు ప్రయత్నించగా తహశీల్దార్ దాసరి విజయశేఖర్ అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడ్డారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాజేటి శివ శ్రీనివాసరావు, పరుచూరి ధనశ్రీ, రత్నకుమారి, గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజయ్ ఘోష్, కూనపరెడ్డి నాగరాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు
కూచిపూడి, సెప్టెంబర్ 18: ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీలకు నిలువ ఉన్న కోడి గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేయటంతో పైకి నిగనిగలాడుతున్నా లోపల కుళ్లిపోయి ఉండటంతో ఏజెన్సీ నిర్వహకులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్న కోడి గుడ్లు మేడిపండు చందంగా ఉన్నాయంటున్నారు. దీంతో విద్యార్థులు వాటిని తినలేక పారవేస్తే ఉపాధ్యాయులు ఆగ్రహిస్తారనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా నేలపాలు చేస్తున్నారు. గతంలో వంట ఏజెన్సీల నిర్వహకులే కోడిగుడ్లను కొనుగోలు చేసి పంపిణీ చేసేవారు, కాగా ఇటీవల వాటి సరఫరా బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కాగా సోమవారం మండలంలోని పెడసనగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాల, స్థానిక జెడ్పీ ఓరియంటల్ పాఠశాలలో కాంట్రాక్టర్ సరఫరా చేసిన గుడ్లు 150కి పైగా కుళ్లిపోవటంతో కాంట్రాక్టర్ లబోదిబోమంటున్నాడు. పెడసనగల్లు హెచ్‌ఎం ఐ గౌరీదేవి గుడ్లు దెబ్బతింటున్న సమాచారాన్ని ఎంఇఓ తోట వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. ఇలాంటి విధానాలతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీయవద్దని సిపిఎం నాయకులు చేబ్రోలు భాస్కరరావు, శీలం ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు.

మైనార్టీ మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 18: స్థానిక 10వ వార్డుకు సంబంధించి మైనార్టీ మహిళలకు కుట్టు శిక్షణా తరగతులను సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. భాష్యం పబ్లిక్ స్కూల్ వద్ద ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు మూడు నెలల పాటు కుట్టు శిక్షణ ఇవ్వటంతో పాటు సబ్సిడీతో కూడిన కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని మైనార్టీ ముస్లిం మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కౌన్సిలర్ షేక్ గౌసియా బేగం, టిడిపి మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ అజీమ్, షేక్ అమీర్, బాషు తదితరులు పాల్గొన్నారు.