కృష్ణ

చేనేత, కలంకారీ వస్త్రాల ‘నీళ్లతీత’పై నిషేధం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 18: కలంకారీ, చేనేత కార్మికులపై అధికారుల వేధింపులకు నిరసనగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ రోడ్డు ఎక్కారు. కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారంతో కలంకారీ, చేనేత కార్మికులను ఇబ్బంది పాలు చేయడం ఎంత వరకు తగునని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌తో పాటు అఖిలపక్ష నాయకులు, వందలాది మంది చేనేత, కలంకారీ కార్మికులు సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నం తరలి వచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. చేనేత, కలంకారీ కార్మికులు అనాదిగా పంట కాలువలో నీళ్లతీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నీళ్లతీత వల్ల పంట కాలువలో నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదులు అందటంతో స్పందించిన జిల్లా యంత్రాంగం గత కొంత కాలంగా పంట కాలువల్లో నీళ్లతీతపై నిషేధం విధించింది. దీంతో కార్మికులు ఎటూ పాలు పోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీళ్లతీతకు అనువైన ప్రాంతం పంట కాలువ మాత్రమేనని, దీన్ని నిషేధించడం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నిషేధిత ఉత్తర్వులను పక్కన పెట్టి కార్మికులు పంట కాలువలో నీళ్లతీత కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో ఇటీవలి కాలంలో అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. దీనిపై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్పందించిన ఆఖిలపక్ష నాయకులు ఉద్యమానికి తెర లేపారు. దీంతో అధికార పార్టీకి చెందిన పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కాగిత వెంకట్రావ్ కూడా కార్మికుల ఆందోళనకు మద్దతు పలికారు. సోమవారం పెడన పట్టణం నుండి వేలాది మంది కార్మికులు బందరులోని కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యతో పాటు కార్మికులపై అధికారులు చేస్తున్న దాడులను ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ జాయింట్ కలెక్టర్-2 బి మార్కండేయులు, ఆర్డీవో సాయిబాబు దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ‘నీళ్లతీత’ నిషేధం ఎత్తి వేయాలని, అధికారుల అక్రమ దాడులను నిలుపుదల చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెడన పురపాలక సంఘం చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఆఖిలపక్ష నాయకులు యక్కల శ్యామలయ్య, మెట్ల గోపీ ప్రసాద్, బళ్ల ప్రసాద్, బొడ్డు రామ్మూర్తి, యక్కల సుకుమార్, కటకం ప్రసాద్, పిచ్చుక సతీష్, సజ్జా మూర్తిరాజు, కొల్లాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత సమయంలో ‘మీకోసం’ అర్జీలను పరిష్కరించాలి
* జెసి గంధం చంద్రుడు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 18: నిర్ణీత సమయంలో ‘మీకోసం’ అర్జీలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెసి చంద్రుడుతో పాటు జాయింట్ కలెక్టర్-2 మార్కండేయులు, బందరు ఆర్డీవో సాయిబాబు సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి చంద్రుడు మాట్లాడుతూ ‘మీకోసం’లో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలన్నారు. పెండింగ్ అర్జీలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ, ఐసిడియస్ సిడిపిఓ కృష్ణకుమారి, డ్వామా పిడి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్టు

మచిలీపట్నం, సెప్టెంబర్ 18: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన ఇరువురు అంతరాష్ట్ర దొంగలను ఎట్టకేలకు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుండి రూ.3లక్షల విలువైన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరినీ జిల్లా అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ సమక్షంలో సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నం ఆర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ పాత్రికేయులకు వివరించారు. ఆధునిక నేర పరిశోధనా పరిజ్ఞానమైన ‘ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పాపిలాన్’ ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని ఎఎస్పీ సాయికృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లాకు చెందిన వల్లపల్లి వెంకటేష్ (42), విజయవాడకు చెందిన షేక్ మస్తాన్ వలి (44) ఉభయ రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడి పోలీసుల కంట పడకుండా తిరుగుతున్నారు. వెంకటేష్ గత సంవత్సరం ఫిబ్రవరి 11వతేదీన ఆర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని చమ్మనగిరిపేటలో నివసిస్తున్న మాటూరి పూర్ణచంద్రరావు ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు రూ.5లక్షల విలువ చేసే సొత్తు అపహరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 7గంటల సమయంలో విజయవాడలోని మరో నిందితుడు మస్తాన్ వలీ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొత్తులో వీరి నుండి రూ.3లక్షలు విలువైన బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆధునిక నేర పరిశోధనా పరిజ్ఞానమైన ‘ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పాపిలాన్’ ద్వారా వీరు ఇరువురిని పాత నేరస్థులుగా గుర్తించారు. వెంకటేష్ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడ్డాడని, మహబూబ్‌నగర్ జిల్లా హనువాడ పోలీసు స్టేషన్‌లో ఇతనిపై డిసి షీట్ ఉన్నట్లు ఎఎస్పీ తెలిపారు. అలాగే విజయవాడకు చెందిన మస్తాన్ వలీ రెండు మర్డర్ కేసుల్లో నిందితుడని, గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసు స్టేషన్‌లో రౌడ్ షీట్ కూడా తెరిచి ఉందని తెలిపారు. నిందితులు ఇరువురిని కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని ఎఎస్పీ సాయికృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో బందరు ఇన్‌ఛార్జ్ డియస్పీ షేక్ హుస్సేన్, సిసిఎస్ డియస్పీ ధర్మేంద్ర, టౌన్ సిఐ వాసవి, ఎస్‌ఐలు హబీబ్ భాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.