కృష్ణ

హోరెత్తిన దుర్గమ్మ నామస్మరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 21: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో గురువారం ఉదయం దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. కనక ప్రభలతో వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి తొలి రోజైన గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉజ్వలమైన ఘట్టానికి చిహ్నంగా దసరా మహోత్సవాల్లో మొదటి రోజున శ్రీ అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా ప్రత్యేక అలంకారంతో దివ్య దర్శనం ఇచ్చిన అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కెనాల్‌రోడ్ వినాయకునికి గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గం గుండా ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకున్నారు. స్థానాచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాల భోగ నివేదన చేయించారు. తొలుత ఉత్సవ మూర్తిని పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇవో చేత కలశస్థాపన, విఘ్నేశ్వర పూజ భక్తితో చేయించారు. అనంతరం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. తర్వాత ఉదయం సుమారు 7-15గంటల నుండి భక్తులను అమ్మవారిని దర్శించుకోవటానికి ఆలయాధికారులు అనుమతించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా తొలి రోజైన గురువారం సాయంత్రం శ్రీ మల్లిఖార్జున మహామండపం నుంచి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచారు. ముందు భాగంలో వివిధ రకాలైన మంగళ వాయిద్యాలు, భజనలు, కోలటాలు, భూత బేతాళలు, కేరళ సంప్రదాయ పద్దతిలో మంగళ వాయిద్యాలు వాటిని కళకారులు ప్రదర్శిస్తుండగా ఛత్ర చామర, ధ్వజ పతాకాలతో అర్చకులు వేద మంత్ర ఘోష నడుమ ఈ నగరోత్సవం సాగింది.
ప్రతి సంవత్సరంలానే మహోత్సవాలకు వచ్చిన భక్తులు వేకువజాము నుండే క్యూమార్గంలోకి వచ్చి దుర్గమ్మ దర్శనం కోసం వేచిఉన్నారు. ఉదయం 8గంటల నుండి వివిధ క్యూమార్గాల్లో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ సంఖ్య మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. తర్వాత సాయంత్రం 5గంటల నుండి రాత్రి 10గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. కెనాల్‌రోడ్ వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి చేరుకున్న భక్తులను పోలీసులు రథం సెంటర్, అశోక్ స్థంభం, ఘాట్‌రోడ్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భక్తులను రద్ధీని నియంత్రిస్తూ కొండపైనున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కొండపైకి అనుమతించారు. భక్తులకు వివిధ శాఖల ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, పాలు అందచేశారు. దుర్గమ్మ దర్శనానంతరం భక్తులు తిరిగి శివాలయం మెట్ల మార్గం, శ్రీ మల్లిఖార్జున మహామండపం, మెట్ల మార్గం గుండా కిందకు చేరుకున్నారు. శ్రీ కనకదుర్గ నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసాదాలను కొనుగోలు చేసి ఎదురుగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. తొలుత కొంతమంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు.

దుర్గగుడి అధికారుల పనితీరుపై విమర్శలు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 21: దసరా మహోత్సవాలు సందర్భంగా దుర్గగు డి అధికారులు చేసిన ఉత్సవ పనులపై తొలి రోజు నుంచే విమర్శనలు మొదల య్యాయ. నవ్యాంధ్ర రాజధానిలోని దుర్గగుడికి సుమారు 15కోట్ల ఖర్చుతో దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ట్లు పదే పదే దుర్గగుడి ఇవో ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉ దయం అమ్మవారి దర్శనం కోసం వచ్చి న భక్తులకు ఇక్కడ చేసిన ఏర్పాట్లు చూసి విస్తుపోయ్యారు. ఘాట్‌రోడ్ మార్గం గుండా కొండపైకి చేరుకున్న భక్తులకు దేవస్థానం తరుపున ఉత్సవాలకు సంబంధించిన స్వాగతం బోర్డు ను సైతం ఏర్పాటు చేయలేదు. రాజగోపురానికి కేవలం బంతి పువ్వులతో అలంకారం చేశారు. ఇదే పద్దతిలో ప్ర ధాన ఆలయం చుట్టూ ఉన్న దేవత మూర్తుల విగ్రహాలు, మండపం చు ట్టూ, అంతరాలయ ముందు భాగం, పై భాగం, తదితర ముఖ్యమైన చోట్ల చేసిన పుష్పాలతో చేసిన అలంకారం వెలవెలపోవటం గమినించి భక్తులు ఇవేమి ఏర్పాట్లు అంటూ విమర్శలు గుప్పించారు.
అలాగే కొండపైకి చేరుకున్న విఐపిలకు సైతం పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయ. ఘాట్‌రోడ్‌పై కార్పేట్‌లు లేకపోవటంతో ఎం డలోనే కాళ్లు కాలుకుంటూ నడిచి వచ్చి రాజగోపురం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం కొండపైన ప్రసాదాల కౌంటర్ లేకపోవటంతో పలువురు విఐపిలు దుర్గగుడి అధికారుల పనితీరుపై విమర్శలు సంధించా రు. రూ.15కోట్లు ఖర్చుతో దసరా ఉత్సవాల నిర్వహణ ఇదేనా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శనలపై సమాధానం చెప్పాల్సిన కనీస బా ధ్యత దుర్గగుడి అధికారులపై ఉంది.