కృష్ణ

కన్నుల పండువగా దర్శనమిచ్చిన అమ్మవార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 21: దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని దేవతామూర్తులను సర్వాభరణాలతో వివిధ రకాల పూలమాలలతో కన్నుల పండువగా తీర్చిదిద్దారు. రాబర్ట్‌సన్‌పేట శ్రీ కన్యకాపరమేశ్వరి, శ్రీ పార్వతీ అమ్మవార్లు, భాస్కరపురం త్రిశక్తిపీఠంలోని శ్రీ లలితాదేవి, గీతా మందిరంలోని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి భక్తులకు కన్నుల పండువగా దర్శనమిచ్చారు. గీతా మందిరంలోని శ్రీ వాసవీమాత శ్రీ బాలాత్రిపుర సుందరిదేవిగా, దత్తాశ్రమంలోని అమ్మవారు శ్రీ గౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఖొజ్జిల్లిపేట శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం, రాబర్ట్‌సన్‌పేట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, బచ్చుపేట, సర్కిల్‌పేట, గొడుగుపేటలలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాల్లో కలశ స్థాపనలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ బాలాత్రిపుర సుందరిగా శ్రీకొండలమ్మ
గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 21: జిల్లాలో శక్తిపీఠంగా ఖ్యాతి గడించిన వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ బెల్లంకొండ ఏడుకలు, ట్రస్టు సభ్యులు చిట్టిబొమ్మ వెంకట నరసమ్మ, చాపరాల రాజేశ్వరరావు, సూరపనేని పరందామయ్య, సత్యనారాయణ, ఆలయ ఇఓ గోగిలేని లీలాకుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అలివేటి మండపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

ఏపి భవన్‌లో 27 నుండి దసరా మహోత్సవాలు
కూచిపూడి, సెప్టెంబర్ 21: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎఇఓ డి సాయిబాబు తెలిపారు. గురువారం మొవ్వ గ్రామంలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దత్తత తీసుకున్న శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మువ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలకు ఆయన అంకురార్పణ చేశారు. ఆలయ అర్చకులు దీవి సీతారామ హనుమాన్, వంశీమోహన్ మువ్వ వేణుగోపాల స్వామికి ప్రత్యేక అలంకారాలు, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు శ్రీ ఆది లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిగింది.