కృష్ణ

దుర్గగుడి ఇవోపై ఉభయదాతల అగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 24: దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి పరిపాల నా తీరు, తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల పై అటు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యు లు, ఇటు భక్తుల నుంచి రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నాయి. తన ప నితీరును మార్చుకోవాలని నిత్యం సూ చనలు చేస్తున్నప్పటికీ ఆమె తన శైలిని మార్చుకోకపోవటంతో ఆదివారం ఉద యం కొండపైన ఉభయదాతలు ఇవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి తీ వ్ర నిరసన వ్యక్తం చేసి ఇవోను కొద్దిసే పు నిలదీసి సమాధానం చెప్పాలని కో రటం బహూశా కొండపైనా ఇదే తొలి సారి కావటం విశేషం. ఇవో ఆదేశాల ను పాటించిన కారణంగానే ఆదివారం సిబ్బంది విఐపిలను అనుమతించి ప్రత్యేక ఉభయదాతలు నిలిపివేయటం తో ఈసంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం సు మారు 10గంటల సమయంలో కుంకుమార్చనలు నిర్వహించుకున్న ప్రత్యేక ఉభయదాతలు అమ్మవారి దర్శనం కో సం అంతరాలయం బయట ఉన్న గేట్ వద్ద వేచి ఉన్నారు. ఇదే సమయంలో విఐపిలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం రూ. 300 టిక్కెట్ క్యూ మార్గంలో వేచి ఉన్నారు. ఇక్కడ విధు లు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రత్యేక ఉభయదాతలను నిలిపి విఐపిలను దర్శనం కోసం అంతరాలయంలోనికి అనుమతించారు. ఈవిషయాన్ని గమినించి ఈప్రత్యేక ఉభయదాతలు సు మారు 3గంటల పాటు అమ్మవారి పూ జలో ఉండి నేరుగా అమ్మవారిని దర్శ నం చేసుకోవటానికి వచ్చిన వారిని పం పకుండా విఐపిలను పంపటం ఎంతవరకు సమంజమని అధికారులతో మాటల యుద్ధానికి దిగ్గారు. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటు బాగా అలిసిపోయిన ఉభయదాతలు ఓపిక నశించి సిబ్బందితో వాదనకు దిగి ఇవో డౌన్ ఇవో డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. విషయాన్ని గమనించిన ఆలయ పర్యవేక్షణ అధికారి యన్ రమేష్ వెంటనే రాజగోపురం వద్ద సిబ్బంది, ఓపిడియస్ సిబ్బందికి రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన విఐపిలకు కొంత సేపు ఆపి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సుమారు 20 నిమిషాల వ్యవధిలోనే ప్రత్యేక ఉభయదాతలకు ప్రత్యేక క్యూ మార్గం ద్వారా అంతరాలయంలోనికి పంపటంతో వివాదం సుమారు అర్ధగంట సేపు వ్యవధిలోనే సమసిపోయింది. ప్రత్యేక ఉభయదాతలు అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తుండగా దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి ఎదురైయ్యారు. దీంతో ఒక ఉభయదాత ఇవోను ఆపి మీరు చేసిన ఏర్పాట్లు ఏమీ బాగా లేవన్నారు. రూ.3వేలు కట్టించుకొని అమ్మవారి దర్శనం కోసం 3గంటలుపాటు ఎండలో ఎందుకు నిలబెట్టారు అంటూ ఆ దాత ఇవో ఎ సూర్యకుమారిపై ప్రశ్నల వర్షం సంధించారు. దీనిపై ఇవో ఎ సూర్యకుమారి మాత్రం మీరు సమస్య చెప్పారు కదా విషయం ఏమిటో నేనే స్వయంగా వెళ్లి విచారించి చర్యలు తీసుకొంటానని సమాధానం చెప్పి చకచక వెళ్లి అక్కడ సిబ్బందితో జరిగిన విషయంపై ఆరా తీశారు.